బాలయ్యతో బాబుకు మరో చిక్కు..

బావమరిది కాసిన్న ఓట్లు సంపాదించి పెడతాడని తోలితే ఉన్న ఓట్లు కూడా రాకుండా చేస్తున్నాడనే బాధ ఇప్పుడు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబులో నెలకొందట.. నంద్యాలలో టీడీపీకి మరో చేదు సంఘటనను మిగిల్చాడు ఎమ్మెల్యే బాలక్రిష్ణ .. రెండు రోజులు వరుసగా జరిగిన సంఘటనలతో టీడీపీ పరువు పోయింది. విశేషం ఏంటంటే ఈ రెండు ఘటనల్లో బాలయ్య చేసిన తప్పిదాలే కారణం.. ఎమ్మెల్యే బాలక్రిష్ణ నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున నిలబడిని భూమా బ్రహ్మానందారెడ్డికి మద్దతుగా నిన్న ఓపెన్ టాప్ జీపుపై రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా వచ్చిన కార్యకర్తలకు డబ్బులు పంచుతూ కెమెరాలకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

బాలయ్య రోడ్ షోకు భారీ స్పందన వచ్చింది. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారందరికి ఖర్చుల కోసం బాలయ్య డబ్బులు పంచాడు. కానీ బహిరంగంగా బాలయ్య టీడీపీ కార్యకర్తలకు డబ్బులు పంచుతూ దొరికిపోవడం ప్రతిపక్ష వైసీపీ పండుగ చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవ్వరీకి డబ్బులు పంచినా కోడ్ ఉల్లంఘన అయ్యి శిక్ష పడుతుంది.

బాలయ్య డబ్బులు పంచిన ఫోటోలు, వీడియోలను ఈసీకి చూపించి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యింది. టీడీపీ నంద్యాలలో డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తోందని.. బాలక్రిష్ణ డబ్బులు పంచడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు..మొత్తంగా మొన్న టీడీపీ కార్యకర్తను కొట్టి టీడీపీని ఇరకాటంలో పెట్టిన బాలయ్య.. నేడు బహిరంగంగా డబ్బులు పంచి బావ చంద్రబాబుకు మరోసారి షాక్ ఇచ్చాడు. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు బాలయ్యను ప్రచారానికే రానిచ్చేవాళ్లం కాదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం.

To Top

Send this to a friend