అన్నంత పనిచేశారు..:


అనుకున్నంత అయ్యింది. కొద్దిరోజులుగా చంద్రబాబు, లోకేష్.. టీడీపీ నేతలు బెదరిస్తున్నట్టుగానే చేసేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టును ఏపీ పోలీసులు ఈ శుక్రవారం ఉదయం 3 గంటలకు హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేశారు. పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ పేర ఫొటోలను పెట్టి టీడీపీ నేతలపై సెటైర్లు వేస్తున్న ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఏపీ పోలీసులు కనీసం హైదరాబాద్ పోలీసులకు ఏమాత్రం చెప్పకుండా దొంగచాటుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మీడియాలో కలకం సృష్టించింది. ఈ అరెస్ట్ పై పోలీసులు రవికిరణ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. రవికిరణ్ భార్య సుజన దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు దమననీతిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే చంద్రబాబు తమ టీడీపీ ఫేస్ బుక్ అధికారిక పేజ్ ద్వారా ఎన్నో పోస్టులు వేశారు. ప్రతిపక్ష వైసీపీని, తెలంగాణలో కేసీఆర్, కవిత, హరీష్, కేటీఆర్ లను అవమానిస్తూ పోస్టులు పెట్టారు. దానికి లేని అభ్యంతరాలు టీడీపీపై పెడితే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారం ఉన్న టీడీపీకి ఒక రూలు.. సాధారణ పౌరులకు మరో రూలా.? అంటూ మండిపడుతున్నారు.

చంద్రబాబు, లోకేష్ లు అనుకున్నట్టే సోషల్ మీడియాపై దాడి ప్రారంభమైంది. ముందుగా పొలిటికల్ పంచ్ వ్యవస్థాపకుడిని అరెస్ట్ చేశారు. తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టు చేసినందుకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనివెనుక టీడీపీ నేత టీడీ జనార్ధాన్ రెడ్డి ఉన్నారని తెలిసింది. ఆయన సోషల్ మీడియాలో పోస్టులపై మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేశారట.. ఆ ఫిర్యాదుపై స్పందించిన చక్రపాణి పోలీసులకు ఆదేశాలిచ్చారట.. అలా మొదట రవికిరణ్ ను అరెస్ట్ చేశారు..

కాగా రవికిరణ్ కు వైసీపీ నాయకులు, జగన్ అండగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు. టీడీపీ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఇలా ఎన్నో పెట్టారని.. వారికి వ్యతిరేకంగా పెట్టిన వారిపై కేసులు పెడితే వైసీపీ నేతలు పోరాడాలని సూచిస్తున్నారు. రవికిరణ్ తరఫున వైసీపీ నేతలు హైకోర్టులో పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది.

To Top

Send this to a friend