అమిత్ బొక్కబోర్లా.. బీజేపీకి ఇది షాకే..

సొంత రాష్ట్రం గుజ‌రాత్ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌బోయి బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా బొక్క‌బోర్లా ప‌డ్డాడు. ఒక్క రాజ్య‌స‌భ స్థానం కోసం అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ అధ్య‌క్షుడుగా ఉండి .,. స్వ‌యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్స‌హించారు .అమిత్ దెబ్బకు ఏకంగా త‌న ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వారిని క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించే ప‌రిస్థితిని సృష్టించాడు. బీజేపీ నీడ‌ప‌డ‌కుండా తిరిగి గుజ‌రాత్ కు తీసుకువ‌చ్చిన త‌మ ఎమ్మెల్యేలు ఎట్టి ప‌రిస్థితుల‌లో చేజారిపోకుండా కాంగ్రెస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి అహ్మ‌ద్ ప‌టేల్ వారిని కాపాడుకుని ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించాడు.

రెండు స్థానాలు గెలిచే అవ‌కాశం ఉన్నా గుజ‌రాత్ లో మూడు స్థానాల‌కు బీజేపీ నిల‌బ‌డింది. బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ రాజ్యసభకు పోటీ చేయ‌గా కాంగ్రెస్ నుండి అహ్మ‌ద్ ప‌టేల్ పోటీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఎర‌వేసిన అమిత్ షా వ‌ల‌లో ప‌డి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 57 మంది ఎమ్మెల్యేలున్న గుజ‌రాత్ లో ఆరుగురు పార్టీని వీడినా 51కి 45 ఓట్లు త‌న‌కు రావ‌డం ఖాయం అని అహ్మ‌ద్ ప‌టేల్ న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఆఖ‌రుకు అదే జ‌రిగి ఆయ‌న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందాడు.

మోడీతో క‌లిసి .. అధికార అండ చూసుకుని దేశ‌వ్యాప్తంగా ఏ దారిలో అయినా బీజేపీ పాగా వేసేందుకు అమిత్ షా వ్యూహాలు ప‌న్నుతున్నాడు. ఒక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌త్య‌ర్ధి పార్టీలు అధికారంలో ఉన్న చోట పాల‌న‌కు అడ్డుపుల్ల‌లు వేసిన కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అమిత్ షా కూడా విస్త‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను వినియోగించుకుంటే అమిత్ షా సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ అధికారుల‌ను వినియోగించుకుంటున్నాడు. రాష్ట్రాల వారీగా ఆర్థికంగా ఉన్న ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌లోని నేత‌ల‌ను గుర్తించి దాడులు చేయిస్తున్నాడు. బ‌ల‌మ‌యిన నేత‌ల ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీసి ఇప్పుడు, భ‌విష్య‌త్ లో వారు బ‌ల‌ప‌డ‌కుండా చేస్తున్నాడు.

అయితే అర్ధ అంగ బ‌లాలున్నా అన్ని చోట్లా నెగ్గ‌లేమ‌ని ఈ గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌తో అమిత్ షాకు అర్ధం అయిఉంటుంది. 2019 ఎన్నిక‌ల్లో ఈ ఫార్ములాను న‌మ్ముకునే ప‌నిచేస్తున్న అమిత్ షా తాజా ప‌రిణామాల‌తో అయినా త‌న ప్ర‌య‌త్నాల‌ను మానుకుంటాడేమో వేచిచూడాలి..

To Top

Send this to a friend