నాగ్‌ రాజకీయాలపై అమల మాట

అక్కినేని నాగార్జున వైకాపాలో జాయిన్‌ కాబోతున్నాడు, గుంటూరు లేదా ఏపీలో మరేదైనా పార్లమెంటు నియోజక వర్గం నుండి ఆయన వైకాపా తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి అనేది గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం. స్వయంగా జగన్‌ రాజకీయాల్లోకి రావాల్సిందిగా నాగార్జునను కోరడంతో పాటు, తన వ్యాపార కార్యక్రమాలు విస్తరించుకోవడం కోసం నాగార్జున రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు నాగార్జున రాజకీయ ఆలోచనే చేయలేదు అంటూ ఆయన భార్య అమల క్లారిటీగా చెప్పేసింది. నాగార్జున వైకాపాలో జాయిన్‌ అవ్వడంను కూడా ఆమె కొట్టి పారేశారు. మీడియా కాస్త ఇలాంటి వార్తలను ప్రసారం చేసే సమయంలో ముందు వెనుక ఆలోచించాల్సిందిగా ఆమె కోరింది. అమల ప్రకటనతో నాగార్జున పొలిటికల్‌ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చింది. వైకాపాలో జాయిన్‌ కాబోతున్నాడు అనే ప్రచారంకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

ప్రస్తుతం నాగార్జున ‘రాజుగారి గది 2’ చిత్రం విడుదల కార్యక్రమాల్లో ఉన్నాడు. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నాగార్జునతో పాటు సమంత కూడా ముఖ్య పాత్రల్లో నటించింది. భారీ అంచనాలున్న ఆ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్‌ రెండవ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు కూడా నాగార్జున చూసుకుంటున్నాడు.

To Top

Send this to a friend