బన్నీ దూకుడు మామూలుగా లేదుగా!


అల్లు అర్జున్‌ గత రెండు సంవత్సరాలుగా వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ఈ రెండు సంవత్సరాలుగా బన్నీ వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను ‘డీజే’ అందుకోబోతుందంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. ‘డీజే’ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఒక వైపు ‘డీజే’ విడుదలకు సిద్దం అవుతున్న సమయంలోనే బన్నీ మరో సినిమాకు సిద్దం అవుతున్నాడు. ప్రమఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాను చేసేందుకు కొన్ని నెలల క్రితం కమిట్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాను ఈనెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ మరియు నాగబాబు సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించబోతున్నారు. దేశ భక్తి కలిగిన కథాంశంలో బన్నీ నటించబోతున్నాడు.

‘నాపేరు సూర్య’ అనే టైటిల్‌ను కూడా ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుతున్నారు. త్వరలోనే హీరోయిన్‌ను కూడా ఫైనల్‌ చేయబోతున్నారు. ఇదే సంవత్సరంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ చాలా దూకుడుగా దూసుకు పోతున్నాడు.

To Top

Send this to a friend