భయపడుతున్న అల్లు అర్జున్, దిల్ రాజు


సోషల్ మీడియాలో కొత్తగా వచ్చిన డిస్ లైక్ ఆప్షన్ తో బన్నీకి, దిల్ రాజుకు షాక్ ఇచ్చారు పవన్ ఫ్యాన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా రిలీజ్ అయ్యే వేళ సినిమాపై రివేంజ్ తీసుకునేందుకు రెడీ అయ్యారన్న సమాచారం డీజే టీంను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మీద అల్లు అర్జున్, దిల్ రాజులు కసర్తతు చేస్తూ సినిమా ప్రమోషన్ లో కొత్త పుంతలు తొక్కించాలని.. పవన్ ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది.

ఎరక్కపోయి కష్టాలు కొని తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.. ఓ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పవన్ ఫ్యాన్స్ తో వైరం పెట్టుకున్నాడు. అది కాస్తా ఇప్పుడు అల్లు అర్జున్ కు కష్టాలు తెచ్చిపెడుతోంది.. అందులో భాగంగానే బన్నీ నటించిన‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీ టీజర్ కు పవన్ ఫ్యాన్స్ కావాలనే డిస్ లైక్ లు కొట్టి సినిమాను అప్రతిష్ట పాలుచేశారు. ప్రస్తుతం జూన్ 23 రిలీజ్ అవుతున్న దువ్వాడ జగన్నాథమ్ మూవీని పవన్ ఫ్యాన్స్ నుంచి కాపాడుకునేందుకు నిర్మాత దిల్ రాజు, హీరో అల్లు అర్జున్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ ఫ్యాన్స్ తో బేటి అవ్వడం కానీ.. లేదా అల్లు అర్జున్ వచ్చి పవన్ పై మీడియాలో సానుకూల వ్యాఖ్యలు చేయడం కానీ చేసేలా దిల్ రాజు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవేళ పవన్ వస్తానంటే ఆయనతోనే ప్రి రిలీజ్ ఆడియో వేడుకను కూడా నిర్వహించాలని అల్లు అర్జున్ , దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సినిమాను పవన్ ఫ్యాన్స్ దెబ్బతీయనీయకుండా రేటింగ్ లు, ప్రమోషన్లను వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్  నుంచి కాచుకోవడానికి ప్రస్తుతం అల్లు అర్జున్, దిల్ రాజు శతథా ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది.

To Top

Send this to a friend