డ్రగ్స్ కేసు.. పడింది పోలీసు పోస్టు..


డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వారికి నోటీసులు పంపడం.. ఆ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ పేర్లు బయటకు పొక్కడం తెలంగాణ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. మీడియా దీన్నీ హైలెట్ చేస్తూ చిలువలు పలువులు చేసి ఆ సినీ ప్రముఖుల పరువు తీస్తోంది. ఇలా డ్రగ్స్ కేసులో సెలబ్రెటీల పేర్లు బయటకు రావడంపై ప్రభుత్వం ఆగ్రహించింది. ఆ శాఖాధిపతి ఐపీఎస్ అకున్ సభర్వాల్ ను సెలవుపై పంపింది. ప్రభుత్వమే ఆయనపై యాక్షన్ తీసుకొని పంపించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

డ్రగ్స్ కేసును పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్న వాళ్ల పేర్లను చట్టపరంగా, నైతికంగా బహిర్గత పరచడం నేరమని.. దయచేసి మీడియాలో వారి పేర్లు, వివరాలు వెల్లడించవద్దని అకున్ సభర్వాల్ సూచించారు. నిబంధనలకు విరుద్దంగా పేర్లను ప్రకటిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచించారు.

మీడియాలో ఈరోజు ఉదయం నుంచి సీనీ హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లకు డ్రగ్స్ కేసులో సంబంధం ఉందని వారిని విచారించేందుకు నోటీసులు ఇచ్చారని ప్రముఖంగా రావడంతో అకున్ సభర్వాల్ సీరియస్ అయ్యారు.. మీడియా వైఖరి సరిగా లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ నోటీసులు లీక్ చేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం తాను వ్యక్తిగత కారణాలతోనే సెలవుపై వెళుతున్నట్టు చెప్పారు.

To Top

Send this to a friend