చై, సామ్‌ 50 రోజుల ప్లాన్‌


అక్కినేని నాగచైతన్య మరియు సమంతలు అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. పెళ్లికి ముందే వీరిద్దరు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫారిన్‌ టూర్లు, పండగ సెలబ్రెషన్స్‌ అంటూ వీరిద్దరు వేరెవ్వరు చేయనంతగా జీవితాన్ని ఎంజాయి చేస్తూ సాగిస్తున్నారు. ఇప్పటికే అత్యంత గ్రాండ్‌గా వివాహ నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరు త్వరలోనే అంతకు మించి వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు.

పెళ్లి తర్వాత హనీమూన్‌ విషయంలో ఈ జంట ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో 40 రోజుల పాటు పూర్తి ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత మొదటి పది రోజులు అమెరికాలో ఉన్న ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌తో గడపనున్నారు. ఆ తర్వాత అమెరికాలోనే స్నేహితుడికి చెందిన విల్లాలో చైతూ తన భార్య సమంతతో ఉండబోతున్నట్లుగా అక్కినేని కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’ మరియు ‘రాజుగారి గది 2’ చిత్రాలతో పాటు తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది. మరో వైపు చైతూ కూడా ‘యుద్దం శరణం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సెప్టెంబర్‌ వరకు ఈ సినిమాలన్నీ కూడా పూర్తి చేయాలని వీరిద్దరు భావిస్తున్నారు. త్వరలోనే పెళ్లి షాపింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవలే చైతూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

To Top

Send this to a friend