పెళ్లి ప్రస్థావన రాలేదు

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ వివాహం జీవీకే మనవరాలు శ్రియ భూపాల్‌తో జరగాల్సి ఉంది. కాని నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైన తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. పెళ్లి క్యాన్సిల్‌కు అసలు కారణం ఏంటి అనే విషయం అక్కినేని ఫ్యామిలీ చెప్పకుండానే దాటేసింది. ఆ విషయాన్ని అంతా కూడా మరచిపోతున్న సమయంలో అఖిల్‌ వివాహం గురించిన మరో వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో మరియు సోషల్‌ మీడియాలో జోరుగా సర్కులేట్‌ అయ్యింది. అదే వెంకటేష్‌ కూతురుతో అఖిల్‌ వివాహం. ఈ వార్తలు సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నాయి.

వెంకటేష్‌ కూతురుతో అఖిల్‌ వివాహంను మూడు సంవత్సరాల తర్వాత చేసేందుకు నాగార్జున ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యామిలీలు స్పందించాయి. మీడియాలో వస్తున్నట్లుగా అఖిల్‌తో మా అమ్మాయి వివాహాన్ని అనుకోలేదు అని దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించింది. ఇక అక్కినేని కుటుంబ సభ్యులు కూడా అఖిల్‌ వివాహం గురించి ఇప్పుడేం ఆలోచించడం లేదు, అసు అఖిల్‌ వివాహం వెంకటేష్‌ కూతురుతో అనే ప్రస్థావనే లేదు అని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం అఖిల్‌ తన రెండవ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నాగార్జున ఆ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడి కూతురు అఖిల్‌కు జోడీగా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే సంవత్సరం వేసవిలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

To Top

Send this to a friend