నిన్న జియో.. నేడు ఎయిర్ టెల్..

ఉచిత ఆఫర్లతో దేశ టెలికాం రంగాన్నే కుదిపేస్తున్న జియో ధాటికి ప్రత్యర్థులు నిలవలేకపోతున్నారు.. నిన్న జియో కొత్త ఆఫర్లను ప్రకటించగానే ఈరోజు ఎయిర్ టెల్ అలెర్ట్ అయ్యింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. నిన్ననే జియో రూ.399తో మూడు నెలల అన్ లిమిటెడ్ ఆఫర్ ను ప్రకటించింది. దాంతో పాటు పాత రూ.309 ఆఫర్ తో 56 రోజులు అన్ లిమిటెడ్ ఆఫర్లను ఇచ్చింది. కాల్స్ , డేటా, ఎస్.ఎం.ఎస్ అన్నీ ఉచితాలు అని చెప్పేసరికి వినియోగదారులందరూ జియో సిమ్ ల వైపే మొగ్గుతున్నారు.

జియో ఆఫర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ ఉలిక్కిపడింది. జియో ధాటికి మరో రెండు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ఎయిర్ టెల్ కొత్తగా సిమ్ తీసుకునే వారికే ఈ అవకాశాన్ని కల్పించింది. కొత్త వినియోగదారులకు ఆకర్షించేందుకు వీలుగా రెండు బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

కొత్తగా చేరే ఎయిర్ టెల్ వినియోగదారులు రూ.449తో కొత్త సిమ్ తీసుకొని రీచార్జ్ చేసుకుంటే వారికి 84 జీబీతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. రూ.293తో సిమ్ తీసుకుంటే 84రోజుల కాలపరిమితితో 4జీ డేటాను రోజుకు 1జీబీ చొప్పున వాడుకోవచ్చు. ఇందులో ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ మాత్రమే ఫ్రీ కాలింగ్ సౌకర్యం కల్పించారు. జియో ఈ సౌకర్యాన్ని రూ.399కే ఇవ్వగా ఎయిర్ టెల్ మాత్రం రూ.449 రేటు పెంచి కేవలం కొత్త సిమ్ తీసుకునే వారికే అవకాశాన్ని కల్పిస్తోంది.

To Top

Send this to a friend