జియోకు షాక్.. ఎయిర్ బంపర్ ఆఫర్

దూసుకుపోతున్న జియోకు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ రంగంలోకి దిగింది. జియో ప్లాన్ లకు సరితూగేలా అంతే రేట్లతో ఆఫర్లను ప్రకటించింది. 399కు అన్ లిమిటెడ్ కాల్స్, డేటాను అందించింది. ఇప్పుడు జియో బ్రాడ్ బాండ్ రంగంలోకి త్వరలోనే దిగబోతుండడంతో ఎయిర్ టెల్ అలెర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ వాడుతున్న వినియోగదారులందరికీ బోనస్ డేటా కింద 1000జీబీ అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించి అందరినీ సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.

ఎయిర్ టెల్ వెబ్ సైట్లో పేర్కొన్న ప్రకారం జియో కంటే కూడా తక్కువ ధరకు నెలకు రూ.899కే 60జీబీ డేటా .. అదనంగా సంవత్సరం పాటు 500జీబీ డేటాను 40ఎంబీపీఎస్ స్పీడుతో అందజేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ధర రూ.1999. దీనితో పోల్చితే ఎయిర్ టెల్ 899కే 60జీబీ డేటా, + 500 జీబీ అదనపు డేటాను సంవత్సరం పాటు ఇస్తామని ప్రకటించింది. దీంతో బ్రాడ్ బ్యాండ్ రంగంలో దిగాలనుకుంటున్న జియోకు ఎయిర్ టెల్ గట్టి షాక్ ఇచ్చినట్టైంది..

రిలయన్స్ జియో.. ఇప్పటికే దేశ టెలికాం రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే జియో ఉచిత సర్వీసుల వల్ల ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ సెల్, టెలినార్, రిలయన్స్ లు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయాయి. టెలినార్, ఎయిర్ సెల్, రిలయన్స్ లు నష్టాలు తట్టుకోలేక మిగతా టెలికాం సంస్థలకు అమ్మడమో, విలీనం కావడానికో ప్రయత్నాలు చేస్తున్నాయి. టెలినార్ అయితే ఎయిర్ టెల్ కు అమ్ముడుపోయింది కూడా. ఇక ఐడియా, వోడాఫోన్ లు కూడా కలిసిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మార్కెట్లో జియోకు పోటీ లేకుండా చేయడమే ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది. అందుకోసమే ఆయన ఫ్రీ ఫోన్ తో పాటు ఉచిత డేలా, కాల్స్ , ఎస్.ఎం.ఎస్ సేవలు అందిస్తున్నారు. దీంతో అలెర్ట్ అయిన ఎయిర్ టెల్ మనుగడ కాపాడుకునేందుకు జియోకు పోటీగా తక్కువ ధరలో సంచలన ఆఫర్లను వరుసగా రిలీజ్ చేస్తూ జియోకు షాక్ ఇస్తోంది.

To Top

Send this to a friend