వైఎస్ మృతిపై మళ్లీ అనుమానాలు..?


‘పనామా, గ్వాటిమాలా దేశాల అధ్యక్షులు అమెరికా గుత్తాధిపత్యాన్ని గతంలో ఎదురించారు. వారి దేశాల్లోని చమురు నిక్షేపాలపై అమెరికా హక్కును రద్దు చేశారు. అనంతరం విమాన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అలాగే చంపేశారని’ వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు..చిత్తూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో భూమన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రెండో సారి అధికారంలోకి రాగానే స్వతంత్రంగా వ్యవహరించారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన ముఖేష్ అంబానీ ఏపీ గోదావరీ-కృష్ణ బేసిన్ లో వెలికితీసిన గ్యాస్ ను జాతీయం చేయాలని.. మొదట ఏపీకే సరఫరా చేయాలని పట్టుబట్టారు. లేకపోతే పైపులైన్లను వేయడానికి అనుమతి ఇవ్వమని రిలయన్స్ సంస్థకు హెచ్చరికలు పంపారు. అనంతరం అనూహ్యంగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు.

ఆయన మరణం వెనుక ప్రమాదం ఉందా.. లేక కుట్రకోణం ఉందనే విషయంపై అప్పట్లో వైఎస్ జగన్ సహా చాలా మంది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, అప్పటి ప్రధాని మన్మోహన్ ను కలిసి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరినా స్పందించలేదు. దీంతో వైఎస్ మరణం వెనుక అనేక శక్తులు ఉన్నాయని భూమన అనడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

ఇదే సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా… చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో సొంతపార్టీ టీడీపీ ప్రజాప్రతినిధులకే రక్షణ లేదని.. చిత్తూరు మేయర్ అనురాధ ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినా ఆమెను, ఆమె భర్తను టీడీపీ నేతలు కక్షతో హతమార్చారని రోజా విమర్శించారు. సొంత వాళ్లనే కాపాడలేని సీఎం చంద్రబాబు ఇక రాష్ట్రంలోని ప్రజలను మహిళలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు.

To Top

Send this to a friend