నవ్వడం వల్ల ఉపయోగాలెన్నో…

 

 

 

‘నవ్వటం ఒక యోగం… నవ్వించటం ఒక భోగం… నవ్వలేక పోవటం ఒక రోగం…’ అని నానుడి. నిజంగా చెప్పాలంటే ఎదుటి వారిలో మనకు నచ్చేది వారి ముఖంలో కనిపించే చిన్న చిరు నవ్వే. ఆ చిరు నవ్వు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.
●-నవ్వుతూ ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఒక చిన్న చిరు నవ్వు రెండు వేల చాక్లెట్‌లను తిన్నా సంతృప్తిని కల్గిస్తుంది.
●-కొంత మంది ఎప్పుడు పెదాలపైనే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. మరి కొంత మంది కండ్లల్లో చూపిస్తారు. ఇంకొంత మందిముఖ హావభావాలతో, ముఖ కవలికలతో వ్యక్తపరుస్తారు.సానుకూలంగా ఆలోచించే వారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. కాబట్టి పాజిటివ్‌ ఆలోచనలు పుట్టించటంతో పాటు అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
●-కొంత మంది ఆరోగ్యంగా ఉండటం కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు. ఎక్కువ కాలం బతకటానికి, విజయానికి కారణమైన ఓ ఉచితమైన మంచి ఔషధం నవ్వు.
●-నవ్వుతూ ఉండటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దాంతో పాటు సానుకూలంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. సృజనాత్మక జ్ఞానం పెంపొందుతుంది.
●-హార్ట్‌బీట్‌ అనేది కరెక్టుగా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. నవ్వటం వల్ల బీపీ తాత్కాలికంగా అదుపులో ఉంచుతుంది.
●-పెద్దగా నవ్వే వారిలో గుండె జబ్బులు చాలా తక్కువగా ఉంటాయి. నవ్వినప్పుడు శరీరంలో ఒత్తిడిని తగ్గించే హార్మోన్లువిడుదలవుతాయి. ఇవి ఆనందాన్ని కల్గిస్తాయి. నవ్వు అనేది ఎండ్రోపిల్స్‌ను విడుదల చేస్తుంది. ఇవి ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే కణాలను నాశనం చేస్తాయి.
●నవ్వటం వల్ల ఇతరులను ఆకర్షించటంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వయసుపై బడినా చూడటానికి యవ్వనంగా కనిపిస్తారు.

To Top

Send this to a friend