అదరగొట్టావ్ ‘గురు’


హిందీలో వచ్చిన ‘సాలా ఖడూస్’.. తమిళంలో దీన్నే రిమేక్ చేసిన ఇరుదు సుట్రు.. ఈ రెండు సినిమాలు మక్కిమక్కి అనువాదమయ్యాయి. కానీ తెలుగులో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత్రలో జీవించే వెంకటేశ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వెంకీ గెటప్ డైలాగ్ డెలివరీ.. యాక్షన్ అదిరిపోయేలా ఉన్నాయి.

వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన రిమేక్ చిత్రం ‘గురు’ ట్రైలర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. బాక్సర్ గా రితిక అదరగొట్టింది. వెంకటేశ్ పర్ఫామెన్స్ అదుర్స్ లా ఉంది..

అయితే ఈ సినిమాలో హీరో వెంకటేశ్ లేని సన్నివేశాలు.. బాక్సర్ రితిక చేసిన ఫైట్లను తమిళ సినిమాలోని సీన్లనే తీసుకున్నారని తెలిసింది. మళ్లీ ఇక్కడ తీయడం ఎందుకనున్నారో లేక.. ఏమో కానీ తమిళంలో ఉన్నట్టు డిట్టోగా దించేశారు. కథ పరంగా ఇది హిందీ, తమిళంలో హిట్ అయ్యింది. తెలుగు వెంకటేశ్ పాత్ర ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సో తెలుగు ఏప్రిల్ 7న వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి..

వెంకటేశ్ నటించిన గురు సినిమా ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend