ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న “ఆచారి అమెరికా యాత్ర”!!

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ “ఆచారి అమెరికా యాత్ర”. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

 

ఇటీవల హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం.. జూన్ నెలలో సెకండ్ షెడ్యూల్ కోసం అమెరికా పయనమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “మే 5న హైద్రాబాద్ లో మొదలైన మొదటి షెడ్యూల్ ముగిసింది. హైద్రాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో భారీ తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. జి.నాగేశ్వర్రెడ్డి గారి విజన్ వల్ల భారీ తారాగణం ఉన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ సజావుగా సాగింది. జూన్ నుంచి సెకండ్ షెడ్యూల్ ను అమెరికాలో ప్రారంభించనున్నాం. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్ గా నిలుస్తుంది” అన్నారు.
విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

To Top

Send this to a friend