వెయ్యి కోట్ల మహాభారతం అయిపోయింది!


ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్‌ శెట్టి అనే వ్యక్తి తాను వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మహాభారతంను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని కూడా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాలో ఇతర పాత్ర సంగతి ఏమో కాని భీముడి పాత్రకు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. సినిమాలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లతో పాటు హాలీవుడ్‌ నటీనటులు కూడా ఉండబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

నాగార్జునను కర్ణుడి పాత్రకు సంప్రదించడం జరిగిందని తెలుస్తోంది. ఆ మద్య ఈ సినిమా గురించి ఓ రేంజ్‌లో పబ్లిసిటీ జరిగింది. ప్రారంభం అయ్యింది అన్నట్లుగా వార్తలు రావడంతో అంతా కూడా మహాభారతం సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ప్రకటించి వారాలు దాటి పోతున్నా కూడా ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్ట్‌ గురించి మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుందని, అది అయ్యే సూచనలే కనిపిండం లేదంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.

మహాభారతం సినిమా అయిపోయింది, మళ్లీ ఎప్పటికో మరో ప్రకటన వస్తుంది, అప్పుడు మరో నెల రోజులు సందడి చేస్తుందని అంతే తప్ప సినిమా వచ్చేది లేదు ఏమీ లేదు అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన కమాల్‌ ఆర్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో వెయ్యి కోట్ల మహాభారతం గురించి ఎలాంటి జోకులు వేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

To Top

Send this to a friend