జియో ఫీచర్ ఫోన్ కొనేముందు.. ఒక్క నిమిషం..

ముకేష్ అంబానీ ఏ క్షణాన 1500 డిపాజిట్ కే ఫీచర్ ఫోన్ అని ప్రకటించాడో ఏమో కానీ అందరూ ఆ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జియో ఫీచర్ ఫోన్ ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా జనాల్లో క్రేజ్ నెలకొంది. దీన్ని సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో అసలు ఈ జియో ఫీచర్ ఫోన్ ఎలా ఉండబోతోంది. దాని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జియో ప్రవేశపెడుతున్న 1500 డిపాజిట్ కే ఫీచర్ ఫోన్ కేవలం జియో సిమ్ కు , ఆ నెట్ వర్క్ కు మాత్రమ పనిచేసేలా కంపెనీ తయారు చేయడం విశేషం. జియో ప్రవేశపెట్టిన ఫీచర్ ఫోన్ కేవలం ఒక సిమ్ మాత్రమే పనిచేస్తుందట.. అది కూడా కేవలం వోల్ట్ ఎల్.టీ.ఈ సపోర్ట్ చేసే సిమ్ మాత్రమే పనిచేస్తుందట.. ప్రస్తుతం దేశంలో వోల్ట్ ఎల్.టీ.ఈ సిమ్ లు కేవలం జియో మాత్రమే ప్రవేశపెట్టింది. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర కంపెనీలు ఈ టెక్నాలజీని వాడడం లేదు. భవిష్యత్ లో జియోను కాదనుకొని వేరే సిమ్ ను వేసుకోకుండా ఈ ఫోన్ తయారు చేసినట్టు అర్థమవుతోంది. ఇక ఈ ఫోన్ లో కేవలం ఒకటే సిమ్ పనిచేస్తుంది. రెండు సిమ్ లు ఇందులో పనిచేయవు. అంటే ఒక జియో సిమ్ మాత్రమే వేసుకోవలన్నమాట.. ఇక ఈ ఫోన్ కోసం జియో కంపెనీ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేసింది. అది జియో సిమ్ కే సపోర్ట్ చేసేలా ఉంటుంది. ఇక ఈ ఫీచర్ ఫోన్ లో వాట్సాప్ పనిచేయదట.. కేవలం యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే పనిచేస్తుందని సమాచారం. వాట్సాప్ కు ఆల్టర్ నేట్ గా జియో చాట్ ను వాడుకోవాలని కంపెనీ పేర్కొంది.చైనా దిగ్గజ కంపెనీలైన స్పెక్రమ్ సంస్థ పార్ట్స్, క్వాల్ కమ్ ప్రాసెసర్ తో జియో ఫోన్ పనిచేస్తుంది.

జియో 4జీ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్ తో ఇతర ఫోన్లకు ఇంటర్నెట్ ను పంచడం కష్టమే. జియో ఫీచర్ ఫోన్ కొన్నాక ప్రతిరోజు కేవలం 500 ఎంబీ డేటా మాత్రమే ఇస్తారట.. ప్రస్తుతం 1500 డిపాజిట్ తో ఫోన్ కొన్నాక ప్రతీ మూడునెలలకు 309తో రీచార్జ్ చేసుకుంటేనే జియో ఫోన్ పనిచేస్తుంది. అలా మూడేళ్లు రీచార్జ్ చేసుకుంటేనే మీ డిపాజిట్ 1500 తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే ఇవ్వరు.. జియో 4జీ ఫీచర్ ఫోన్ కు టీవీకి అనుసంధానించే కేబుల్ కోసం మరో 500 చెల్లించాల్సిందేనట.. అలా చేస్తేనే జియో ఫీచర్ ఫోన్ తో టీవీలో లైవ్ టీవీలు తదితర ఇంటర్నెట్ ఆధారిత ప్రోగ్రాంలు టీవీ షోలు చూడవచ్చట..ఇలా ఇన్ని కొర్రీలున్నాయి కాబట్టే అంత తక్కువకు అంబానీగారు మనకు ఫోన్ ఇస్తున్నారు.. మీరు కొనేటప్పుడు ఇవన్నీ గుర్తుంచుకొని కొనండి.. మరి..

To Top

Send this to a friend