హీరో, విలన్, కమెడియన్.. అంతా ఎన్టీఆరే..

వరుసగా మూడు హిట్లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ జోష్ మీదున్నారు. ఇప్పుడు తన తరువాతి సినిమా ఏంటనేది అందరికి ఆసక్తిగా మారింది.. ప్రస్తుతం ఆయన రవిందర్(బాబి) చెప్పిన కత నచ్చడంతో ఆ సినిమాకు ఓ కే చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. సొంత బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం ముహూర్తాన్ని ఫిబ్రవరి 10న, షూటింగ్ ను ఫిబ్రవరి 15నుంచి మొదలు పెడుతున్నట్టు కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు తెలిసింది. హీరో, విలన్, కమెడియన్ ఇలా మూడు డిఫరెంట్ పాత్రల్లో ఒదిగి అలరించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ముగ్గురు హీరోయిన్లను అనుకుంటున్నట్టు తెలిసింది. కాజల్,అనుపమ, అనూ ఇమ్మాన్యూయల్ ల పేర్లు పరిశీలించగా.. ఒక హీరోయిన్ గా చివరకు రాశీఖన్నా ఓకే అయినట్టు సమాచారం. మరో ఇద్దరికోసం కాజల్, అనుపమలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.. అదుర్స్ లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. ఈ కొత్త సినిమాలో త్రిపాత్రాభినంయం ఇరగీస్తాడని.. అభిమానులు అంచనా వేస్తున్నారు..

To Top

Send this to a friend