సామాన్యుడిని బొందపెట్టారు..


దూకుడు, అహంభావం.. ఏకపక్ష నిర్ణయాలు అంతటా పనిచేయవు… ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఒకలా ఉండరు.. ఢిల్లీలో సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని చిత్తుచిత్తు చేశాక అన్ని పత్రికలు, మీడియా తెగ రాసేశాయి. దేశ రాజకీయాల్లో ప్రభంజనం అన్నారు. సామాన్యుడిదే అధికారం అన్నారు. కొత్త ఆశాకిరణం అన్నారు. కానీ వాటిని నెత్తిన ఎక్కించుకున్న సామాన్యుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అదే ఢిల్లీలో ఘోరంగా దెబ్బతిని 5 రోజులు ఇంటినుంచి బయటకు రాకుండా కుమిలిపోయిన కమలసేనాని నరేంద్రమోడీ ఇప్పుడు విజయగర్వంతో చిరుమందహాసం చేస్తున్నారు.

అదే సామాన్యుడు కేజ్రీవాల్ కానీ ఎందుకు పంజాబ్ , గోవాలో గెలవలేకపోయారు. దానికి ఆయన చెప్పిన సమాధానం డబ్బు లేకపోవడం.. కానీ డబ్బులేకపోవడం వల్లే కదా కేజ్రీవాల్ 5 రాష్ట్రాల్లో కాకుండా కేవలం పంజాబ్, గోవాల్లో మాత్రమే పోటీచేశారు. పంజాబ్ లో అధికారం ఖాయమనుకున్నారు. గోవాలో ఖాతా తెరుస్తామన్నారు. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో సామాన్యుడిని ఓటర్లు బొందపెట్టారు..

ఎన్నికలకు ముందు బీజేపీని వీడిన నవ జ్యోత్ సింగ్ సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుదామనుకున్నారు. కానీ సీఎం సీటుపై కేజ్రీవాల్ సిద్దూకు హామీ ఇవ్వలేదు. దీంతో పాటు కేజ్రీవాల్ దుందుడుగు శైలి, ఏకపక్ష నిర్ణయాలతో మండిన సిద్దూ ఆప్ ను వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఇఫ్పుడు కాంగ్రెస్ పంజాబ్ లో గెలిచింది. ఆ గెలుపులో సిద్దూ పాత్రనే కీలకం.. అంతటి సిద్దూను వదులకొని మొండిపట్టుదలతో కేజ్రీవాల్ అధికారానికి దూరమయ్యాడు. దూకుడు, మొండితనం.. అర్థంపర్థం లేని వివాదాలతో మోడీని టార్గెట్ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలం కావడంతో 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘోరం ఓడిపోయారు.

To Top

Send this to a friend