‘సద్బ్రాహ్మణ’ వినోద ప్రాప్తిరస్తు..

అల్లు అర్జున్ సినిమా సినిమాకు కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఆర్య నుంచి మొదులుపెడితే హెయిర్ స్టైల్ నుంచి వేసుకునే బట్టలు వరకు.. కథలో కూడా కొత్తదనం చూపిస్తూ ప్లాపులు ఎరగని కథనాయకుడిగా గుర్తింపు పొందారు. అందుకే బన్నీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ.. నష్టం అయితే కాదు..లాభాలే అన్న టాక్ తెలుగు ఇండస్ట్రీలో నెలకొంది..
మొదట రేసుగుర్రంలో అల్లరి చిల్లరి అబ్బాయిగా మెప్పించిన బన్నీ ఆ తర్వాత సరైనోడుతో కండలు,మీసాలు పెంచి రోషం పౌరుషం చూపించారు. అంతుకుముందు త్రివిక్రమ్ తో కుటుంబ కథా చిత్రంలో ఒదిగిపోయారు. ఇలా సినిమా సినిమా వైవిధ్యం చూపిస్తున్నందుకే బన్నీ టాప్ లో ఉన్నారు.
ఇక తన తరువాతి చిత్రం దువ్వాడ జగన్నాథమ్ లో కూడా బన్నీ వైవిధ్యం చూపించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. రెండు రోజులుగా బన్నీ తన కొత్త చిత్రం దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ కౌంట్ డైన్ స్టార్ట్ చేశారు. ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో చిత్రం షూటింగ్ నడుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నవ్వులు పువ్వులు విరుస్తాయని తెలిసింది. మొత్తానికి ఇలా కామెడీ, కుటుంబ కథా, ఎమోషనల్, చిత్రాలతో బన్నీ కొత్త కథలతో సినిమాలు తీస్తూ ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో హిట్ ల మీద హిట్ లు ఇస్తూ దూసుకుపోతున్నారు.

To Top

Send this to a friend