శ్రీమంతుడు కాపీనా.. డబ్బుల కోసమా.?

ఒక సినిమా హిట్ కాగానే దానిపై ఎన్నో లూప్ హోల్స్ వెతుకుతుంటారు.. ఈ కథ నాది అని కొందరంటారు.. మరికొందరు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతారు.. శ్రీమంతుడు విషయంలో అదే జరిగింది. ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. అంత వరకు ఓకే.. అప్పట్లోనే ఈ కథ నాది అని ఓ రచయిత ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. ప్రస్తుతం ఇప్పుడు ఇదే శ్రీమంతుడు స్టోరీని హిందీలో హృతిక్ రోషన్ కథానాయకుడుగా రిమేక్ చేస్తున్నారు. దీంతో కొందరు మళ్లీ కోర్టు మెట్లు ఎక్కి శ్రీమంతుడు నిర్మాతలకు, దర్శకుడు కొరటాల శివకు నోటీసులు పంపారు. అలాగే హిందీలో నిర్మాణం కాకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు..
మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా కథ తాను రాసిన నవల ఆధారంగా తెరకెక్కిందని.. శరత్ చంద్ర అనే నవలాకారుడు హైదరాబాద్ లోని అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్వాతి మాసపత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శ్రీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్ర కథగా దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఇందుకు గాను కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని పిటీషన్ లో కోరారు. దీంతో కోర్టు నిర్మాతలు, దర్శకుడికి సమన్లు జారీ చేసింది..

కథలు అనేవి ఊహాజనితమైనవి.. ఎక్కడైనా ఇన్ స్పిరేషన్ తో పుట్టుకొచ్చేవి. చాలా కథలు మన జీవితంలో జరిగినవే ఉంటాయి. ఎక్కడో విన్న అనుభవాలు, చూసిన కథలు, చదవిన నవలలు ఉంటాయి. అంతా మాత్రనే మొత్తం కథలు నాదంటూ కొందరు కోర్టుకెక్కడం.. దానికి పరిహారం కోరడం సమంజసం కాదు.. హిట్ కథలు మావి అని చాలామంది కోర్టు మెట్లు ఎక్కి పరిహారం కోరుతుంటారు. కథ సొంతం అని సదురు దర్శకుడు నిరూపించుకునేవారైతే పోరాడుతారు. నిరూపించకపోతే సదురు కథ రచయితతో బేరసారాలు ఆడి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. కానీ ఇలా పెద్ద హీరో సినిమాలను టార్గెట్ చేసి కథకులు కోర్టు మెట్లు ఎక్కడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది..

To Top

Send this to a friend