శైవ-వైష్ణవ వివాదంలో అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమా షూటింగ్ సమయంలోనే వివాదంలో చిక్కుకున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో జరుగుతోంది. అందులో శివాలయం.. శివలింగం సెట్లను చిత్రం యూనిట్ వేశారు. ఇది స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అక్కడి బ్రాహ్మణులు, వైష్ణవులు తరలివచ్చి షూటింగ్ ను అడ్డుకున్నారు. వైష్ణవ ఆలయంలో శివాలయం సెట్ ఎలా వేస్తారని.. షూటింగ్ పేరు చెప్పి భక్తులను ఆలయంలోకి రాకుండా ఎందుకు అడ్డుకుంటారని స్థానికులు షూటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో నిర్మాత దిల్ రాజు-దర్శకుడు హరీష్ శంకర్ లు వారికి సర్ధిచెప్పే ప్రయత్నాలు చేశారు. తాము దేవాదాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని.. షూటింగ్ జరిగాక తీసేస్తామని చెప్పుకొచ్చారు. అయినా ఆందోళనకారులు వినకుండా నిరసన తెలపడంతో షూటింగ్ ఆగిపోయింది.

అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఒక పెద్ద ఆలయంలో బ్రాహ్మణుల నివాసప్రాంతాల్లో చేస్తున్నారు. ఇప్పుడు వైష్ణవ ఆలయంలో శివాలయం సెట్ వేయడం వివాదానికి కారణమైంది. బన్నీ ఇందులో బ్రాహ్మణ పాత్ర పోషించడం కూడా వివాదాస్పదమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో చిత్రం యూనిట్ ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటె మంచిది.

To Top

Send this to a friend