శశికళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లడమా..?

జయలలిత అప్పట్లో శశికళ వైఖరి నచ్చక తన ఇంట్లోంచి పోలీసులను రప్పించి మరీ వెళ్లగొట్టించింది.. శశికళ జయలలిత ఇంట్లో పనిమనిషిగా చేరిందని కొందరంటారు… జయ ప్రాణ స్నేహితురాలు అంటారు.. 5 ఏళ్ల క్రితం జయ అండతో అక్రమాలకు పాల్పడ్డ శశికళను జయనే ఇంటినుంచి గెంటేసిన మాట వాస్తవమే.. అదిగో ఇప్పుడు ఆ విషయాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేస్తున్నారు. మామూలు ఆట కాదు.. నెటిజన్లు శశికళను ఇరగీస్తున్నారు. పోలీసులు జట్టుపట్టి శశికళను ఇడ్చుకెళుతున్నట్టు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో శశికళ ను మార్ఫింగ్ చేసి పెట్టారు. శశికళను పోలీసులు జుట్టు పట్టుకొని తీసుకెళ్లడం అందులో ఉంది. దీన్ని శశికళ వ్యతిరేకులు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు.
ఓ కన్నడ సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని ఆ మహిళ ముఖానికి శశికళ ఫొటోను యాడ్ చేసి మార్ఫింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తోంది. జయలలిత హయాంలో ఒకప్పుడు ప్రతిపక్ష నేత కరుణానిధిని, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని అమ్మకు వ్యతిరేకంగా ఉన్న మరికొందరిని ఇలానే నిర్ధాక్షిణ్యంగా పోలీసులు లాక్కెల్లిన సంఘటనలు మనం చూశాం.. అందులో భాగంగానే శశికళను కూడా జయ గెంటించివేసిందంటూ ఈ ఫొటోను సర్య్కూలేట్ చేస్తున్నారు. కానీ ఇది ఓ కన్నడ సినిమాలోని సన్నివేశం .. తమిళంలోకి కరిమెడ అనే పేరుతో విడుదలైంది. పూజాగాంధీ అనే నటిని పోలీసులు లాక్కెలుతున్న ఫొటో ఇదీ.. దాన్ని మార్ఫింగ్ చేసి శశికళతో నెటిజన్లు ఆట ఆడుకుంటున్నారు.

To Top

Send this to a friend