వెంకన్నా.. నేనొస్తున్నా..:

సీఎం కేసీఆర్ తిరుమల టూర్ ఖరారైంది. ఈనెల 21న ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణుగుంట విమానాశ్రాయానికి వెళతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 21 సాయంత్రం తిరుమల చేరుకొని సేదతీరుతారు. 22న ఉదయం తిరుమలేశుడిని దర్శించుకుంటారు. కేసీఆర్ తెలంగాణ వస్తే కానుకలు సమర్పిస్తాని తిరుపతి వెంకన్నకు మొక్కాడు. ఇప్పుడు ఆ మొక్కలు తీర్చుకుంటున్నాడు.. తిరుమల తర్వాత కేసీఆర్ గుట్ట కింద అలివేలు మంగాపూరుంలో అమ్మవారికి బంగారు ముక్కుపుడుకను సమర్పిస్తారు.
తెలంగాణ సిద్ధిస్తే తిరుపతి వెంకన్న, యాదాద్రి, వరంగల్ భద్రకాళి, వేములవాడ సహా ప్రముఖ దేవాలయాలకు బంగారు కానుకలు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునే పనిలో భాగంగా టీటీడీకి తిరుమల వెంకన్న కోసం 5 కోట్ల విలువైన ఆభరణాలను తయారు చేయమని కోరారు. టీటీడీ వీటిని కోయంబత్తూరులోని కీర్తిలాల్ జ్యువెల్లరీలో తయారు చేయించింది. అవి పూర్తయి తిరుమలకు చేరుకున్నాయి. 3.7 కోట్ల విలువైన సాలగ్రామ హారం.. .1.21 కోట్ల కంఠాభరణం మొత్తం 18.85 కిలో బరువున్న బంగారు కానుకలను కేసీఆర్ తిరుమలేషుడికి సమర్పిస్తారు.. కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో తెలంగాణ కోసం ఆయన మొక్కలు ఇక త్వరలో తీరిపోయినట్టే..

To Top

Send this to a friend