వర్మ ట్వీటాడు.. జయలలిత ఆత్మ.. మోడీ భూతవైద్యుడు..

ఎప్పుడూ వివాదాలతో అంటకాగే దర్శకుడు రాంగోపాల్ వర్మ తమిళనాడు వ్యవహారాలపై తనదైన శైలిలో స్పందించారు. తమిళనాడు పరిణామాలను చూస్తుంటే ఓ పొలిటికల్ హర్రర్ మూవీని తలపిస్తోందని ట్వీట్ చేశారు. అంతేకాదు జయలలిత ఆత్మ మాజీ సీఎం పన్నీర్ కు చెప్పడం విడ్డూరమని.. ఈ వ్యవహారంలో మోడీ భూతవైద్యుడి పాత్రను పోషిస్తున్నాడా..? అని వర్మ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
వర్మ ట్వీట్ సారాంశం విషయానికి వస్తే.. జయలలిత ఆత్మ పేరుతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం అధికారం చేపట్టేందుకు డ్రామాలాడుతున్నాడని.. దీనివెనుక ఉండి మోడీ నడిపిస్తున్నారని అర్థం వచ్చేలా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుత రాజకీయ, సినీ పరిణామాలపై ప్రకటనలు చేసే వర్మ ఈసారి కూడా తనదైన శైలిలో తమిళనాడు రాజకీయాలపై తన మార్కు అభిప్రాయం చెప్పాడు.

To Top

Send this to a friend