వర్మ ట్రైన్ రివర్స్.. చిరుపై పొగడ్తలు..

రాంగోపాల్ వర్మకు బుద్ది వచ్చింది.. తాను కూసిన కూతలు తప్పు అని తెలిసాయో లేక..ఖైదీనంబర్ 150 వసూళ్ల ప్రభంజనం చూశోడో ఏమోకానీ నోరు జారిన ఆ నోటితో చిరంజీవిపై ప్రశంసలు కురిపించాడు.. సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి , బాలక్రిష్ణ చిత్రాలపై హాట్ కామెంట్లు చేశాడు రాంగోల్ వర్మ. బాలక్రిష్ణ శాతకర్ణి మూవీని ఆకాశానికెత్తి చిరు సినిమాపై సెటైర్లు వేశాడు. కానీ అంతిమంగా సంక్రాంతి కోడిపుంజులా చిరు ఖైదీనంబర్ 150 వన్ అండ్ ఓన్ల మూవీగా ఘనవిజయం సాధించింది. రికార్డుల మోత మోగిస్తోంది.. బాహుబలి సినిమా వసూళ్లనే బ్రేక్ చేసి తొలిరోజునుంచే దుమ్మురేపుతోంది.. ఇది చూసి వర్మకు బుద్ది వచ్చిందో.. లేక యూటర్న్ తీసుకున్నాడో ఏమోకానీ వర్మ మారిపోయాడు.. పోస్టర్లు, టీజర్లును సైతం విమర్శించి చిరుతో కయ్యానికి కాలుదువ్విన వర్మ ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ లో పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యానించాడు..

వర్మ తన ట్వీట్ లో వ్యాఖ్యానిస్తూ ‘‘ఇప్పుడే ఖైదీ నంబర్ 150 సినిమా చూశానని..ఫంటాస్టిక్ గా ఉందని పొగడ్తలతో ముంచెత్తాడు.. మెగస్టార్ ఎనర్జీ లెవల్స్ ఇప్పటీకీ ఓ రేంజ్ లో ఉన్నాయని.. తొమ్మిదేళ్ల కిందట సినిమాలకు దూరమయినప్పుడు ఎలా ఉన్నాడో చిరు ఇప్పుడు ఖైదీ సినిమాలో అంతకంటే యంగ్ లా కనిపించాడని ట్వీట్ చేశాడు వర్మ.. చిరుకు మిలియన్ చీర్స్ అంటూ విషస్ చెప్పాడు. కాగా వర్మ ఈ ట్వీట్లతో మెగాస్టార్ అభిమానులు కుషి అవ్వగా సడన్ గా ఇలా సాత్వికుడిగా మారిన వర్మ వైఖరి మిస్టరీలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు..

To Top

Send this to a friend