‘రోజా ఆంటీ..’ బోండా ఉమా ఏశాలు..


ఏపీలో బూతు రాజకీయం నడుస్తోంది. అసలు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు బూతు పురాణం చెబుతున్నారు. అసెంబ్లీ అంటే వెగటు పుట్టేలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

గతంలో ఎమ్మెల్యే రోజా.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనితను పరుష పదజాలంతో ఆమె వ్యక్తిగతాన్ని అవమానిస్తూ మాట్లాడారు. దానికి మూల్యం చెల్లించుకొని సంవత్సరంగా అసెంబ్లీకి దూరమయ్యారు. ఇక అప్పుడే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఓరేయ్, ఎవడ్రా, పాతేస్తా అంటూ పరుష పదాలు వాడారు.. నిన్న ఏకంగా రోజాను పట్టుకొని ఆంటీ అని అని వివాదానికి దారితీశాడు..

రోజా జబర్దస్త్ మాయలో పడి బయట ఇంటా అదే లాంగ్వేజీని ఉపయోగిస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు తక్కువ తినలేదు.. బోండా ఉమా లాంటి నేతలైతే మరీ బరితెగించి పోయారు.. ‘రోజాను ఆంటీ అంటే తప్పేంటి అని అన్నాడు. అది బూతు అని భావిస్తే ఎలా అని వ్యాఖ్యానించాడు.. అంతేకాదు.. రోజా అంటూ అసెంబ్లీలో అటెండర్, హెల్పర్ కూడా భయపడడు.. గౌరవించడం నేర్చుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు..

సభ్య సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా బూతు పురాణం చెబుతూ నవ్వుల పాలు అవుతున్నారు. కనీసం మహిళా ప్రజాప్రతినిదులనీ.. వారి వయసుకైనా విలువనిచ్చి సభా సంప్రదాయాలు కాపాడితే మంచిది. ఏపీ శాసనసభ సాక్షిగా ఇంతటి ఆకృత్యాలు, పరుష పదాలు వాడుతున్నా ధృతరాష్ట్రుడిలా కళ్లుండి సముదాయించని స్పీకర్ కోడెల వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend