రానా బాహుబలి గ్యాప్ లో నటించిన సినిమా ట్రైలర్

rana

రానా బాహుబలి గ్యాప్ లో నటించిన సినిమా ఘాజీ.. తెలుగు, హిందీలో తీసిన ఈ సినిమాను పీవీపీ బ్యానర్-మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో రూపొందించారు. సంకల్ప్ చిత్ర దర్శకుడు. రానా-తాప్సీ జంటగా తీసిన ఈ చిత్రం వాస్తవగాథ ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటివరకు రకరకాల పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకోగా.. ఏకంగా సంక్రాంతి కానుకగా ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు..

కథ విషయానికి వస్తే భారత్ –పాకిస్తాన్ ల మధ్య 1971 లో జరిగిన యుద్ధం నేపథ్యంలో జరిగిన వాస్తవాల నుంచి కథను తీసుకున్నారు.. పాకిస్తాన్ నుంచి ఘాజీ అనే జలాంతర్గామి విశాఖపట్నానికి నేరుగా వచ్చేసింది. దీంతో అలెర్టయిన నౌకాదళం ఏం చేసిందనేది కథాంశం.. అసలు సబ్ మెరైన్ ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చింది..మార్గమధ్యలో ఎలాంటి అపశృతులు ఎదురయ్యాయి.. సినిమాలో దీనికి ఎలాంటి ముగింపు ఇచ్చార్నది అసలు స్టోరీ.. ఇండియాలో ఇలా సముద్రంలో సాగిన కథ.. ఇప్పటివరకు రాలేదు. ఇందులో రానా హీరీగా నటించడం కూడా చాలా ప్లస్ అయ్యింది.. ఈ చిత్రం ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఘాజీ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి చిత్రం యూనిట్ నిర్ణయించింది..

ఈ ఘాజీ చిత్రం ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend