రాజమౌళిని చూసి మహేశ్ నేర్చుకోవాల్సిందే..


సినిమా ఎంత బాగా తీసినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలి.. జనం చూసేలా ఎప్పుడూ ఏదో మ్యాజిక్ చేయాలి.. అంటే సినిమా విశేషాలు.. పోస్టర్లు.. కటౌట్లు, టీజర్లు, ఇలా ఏదో ఒకటి విడుదల చేస్తే దాని ఊపు వస్తుంది. జనంలో నాని సినిమాపై హైప్ వస్తుంది. అదీ లేకనే ఇప్పుడు మహేశ్ సినిమాలు అంతగా ఆడడం లేదు.
సినిమా ప్రమోషన్లు, ఇతర విషయాల్లో మహేశ్ బాబు కచ్చితంగా రాజమౌళిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే బాహుబలి సినిమా కోసం రాజమౌళి చేయని ప్రయత్నం లేదు. కామిక్స్, గేమ్స్, కళఖండాలు, చిత్రాలు, పోస్టర్లు, టీజర్లు, ఇంటర్వ్యూలు ఇలా ఒక్కటేమిటీ సినిమా కోసం ఎన్నో వినూత్న ఐడియాలు చేస్తూ సినిమాకు భారీ హైప్ తీసుకొస్తున్నారు.
ఇది మహేశ్ బాబుకు కొరవడింది. మిగతా హీరోలైన బన్నీ, రాంచరణ్, పవన్ లాంటి వాళ్లు తమ సినిమాలపై టీజర్లు, పోస్టర్లు, తదితర సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేస్తూ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.కానీ సంవత్సరం కాలం దగ్గరవుతున్నా మహేశ్ బాబు-మురగదాసు చిత్రంపై కొంచెం కూడా అభిమానులకు తెలియలేదు. కనీసం సంభవామి అనే టైటిల్ కూడా నిర్ధారణ కాలేదు. పోస్టర్లు, టీజర్లు అసలే లేవు. మహేశ్ బాబు మురగదాసు కాంబినేషన్ పై భారీగా ఉన్న అంచనాలు.. కోట్లు పెట్టి తీస్తున్న ఈ సినిమాపై కనీస ప్రచారం చేయకుండా సినిమా బృందం వ్యవహరిస్తున్న తీరు వాళ్లకు నష్టాలు చేకూర్చేవిధంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

To Top

Send this to a friend