రాంచరణ్ మల్టీస్టారర్ త్రిభాష చిత్రం


క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల రాంచరణ్ ను కలిసి ఓ కథను వినిపించిన సంగతి తెలిసిందే.. చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ కోసం చిరు స్నేహితురాలు సుహాసిని ఆమె భర్త మణిరత్నంతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రోగ్రాంలో పాల్గొన్నాక చిరు వారిని ఇంటికి ఆహ్వానించారట.. అక్కడే మణిరత్నం రాంచరణ్ కు ఓ కథను వినిపించినట్టు సమాచారం. అయితే అది భారీ మల్టీస్టారర్ మూవీ అని తెలిసింది. ఈ సినిమాలో రాంచరణ్ సహా తమిళ స్టార్ హీరోలు విక్రమ్, విజయ్ లు హీరోలుగా నటించనున్నారని తెలిసింది.

తెలుగు, తమిళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మణిరత్నమే తన మద్రాస్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారట.. జూన్ 2017 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ కేజ్రీ మల్టీస్టారర్ కాంబినేషన్ తో రాంచరణ్ తమిళ మార్కెట్ లోకి ప్రవేశించనున్నారు. తమిళంలో కూడా తన మార్కెట్ ను పెంచుకునేందుకే రాంచరణ్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెగా హీరో బన్నీ మళయాళం, తమిళంలో నేరుగా సినిమాలు విడుదల చేస్తూ అక్కడ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాంచరణ్ కూడా బన్నీ బాటలోనే నడవాలని మణిరత్నం సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం..

ఇటీవల తెలుగు సినిమాలో భారీ మార్పులు వస్తున్నాయి. బాలీవుడ్ లో లాగా టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. వెంకటేశ్-మహేశ్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సినిమాను చేశారు. ఆ తర్వాత వెంకటేశ్-పవన్ లు ‘గోపాల గోపాల’ సినిమాను తీసి టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికారు. ఇప్పుడు రాంచరణ్ సైతం ముందుకు వచ్చి తమిళ అగ్రహీరోలతో కలిసి నటిస్తున్నాడు. అటు తమిళ, తెలుగు,హిందీల్లో కూడా మార్కెట్ ను పెంచుకునేందుకు రాంచరణ్ రెడీ అవుతున్నారు.

To Top

Send this to a friend