రసకందాయంలో భారత్-బంగ్లాదేశ్ టెస్ట్

భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ రసకందాయంలో పడింది.. హైదరాబాద్ లో జరిగిన భారత్-బంగ్లాదేశ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం దిశగా సాగుతోంది.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 687/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ రాణించారు. 388 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 159/4 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. పూజారా 54, రహానే 28, కోహ్లీ 38 పరుగులు చేశారు. వేగంగా పరుగులు పూర్తి చేసి డిక్లేర్ చేసి బంగ్లాను రెండో ఇన్నింగ్స్ కు ఆహ్వానించారు..

సాయంత్రం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. జడేజా, అశ్విన్ విజృంభించడంతో 4వ రోజు బంగ్లా బ్యాట్స్ మెన్ తడబడ్డారు. బంగ్లాదేశ్ 84 కే మూడు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.. భారత్ రెండో ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేసిన వాటితో మొత్తం ఆధిక్యం 459 పరుగులకు చేరింది. దీంతో బంగ్లా దేశ్ ఆఖరి రోజైన సోమవారం ఈ లక్ష్యం అందుకోవడం కష్టమే.. దీంతో భారత బౌలర్లను కాచుకొని చివరి రోజంతా బంగ్లా బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేయాలి. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఓటమి బాటలోనే బంగ్లా ప్రస్తుతం పయనిస్తోంది..

To Top

Send this to a friend