రవిప్రకాశ్ దోస్తీ వెనుక కారణాలు..

టీవీ9 సీఈవో రవిప్రకాశ్ .. పవన్ కల్యాణ్ సినిమా కాటమరాయుడు ఫంక్షన్ ఎదుకొచ్చారు..? పవన్ ను ఎందుకు అంతలా ప్రశంసించారు.? ఇంతకీ రవిప్రకాశ్ ఎజెండా ఏమిటీ.? ఏనాడు కూడా రాజకీయ నాయకులును విమర్శించడం తప్పితే ప్రశంసించని ఆయన ఎందుకు అనూహ్యంగా పవన్ వెనుక పడ్డారు? రవిప్రకాశ్ పవన్ నుంచి ఏమీ ఆశిస్తున్నారు..? తెరవెనుక అసలేం జరుగుతోంది.? అనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.? కాటమరాయుడు ఆడియో ఫంక్షన్ లో తనను ఆకాశానికి ఎత్తిన టీవీ9 సీఈవోను పవన్ కరుణిస్తారా.? తన పంచన చేర్చుకుంటారా.? అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది..

ఇప్పటివరకు టీవీ9 ఏపీ సీఎం చంద్రబాబుకు సపోర్టుగా నిలిచి ప్రచారం చేసింది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను వీలైనంత డ్యామేజ్ చేయడానికి చానల్ ను రవిప్రకాశ్ వాడాడు.. కానీ విచిత్రంగా కాటమరాయుడు ఫంక్షన్ కు వచ్చి పవన్ ను ప్రశంసించడం.. సపోర్ట్ ఇస్తాననడం విడ్డూరంగా ఉంది.. ‘రవిప్రకాశ్ ఏదైనా రాజకీయ అవసరాల కోసం ఈ పనిచేశారా.? లేక ఏపీలో 2019లో తాను సైతం బరిలోకి దిగుతారా’ అన్న సందేహాలు వెలువడుతున్నాయి.

టీవీ9ను అమ్మకానికి పెట్టేశారనే వార్త సంచలనంగా మారింది. బడా పారిశ్రామిక మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఎప్పటినుంచో మీడియాలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయనే టీవీ9ను నెలకిందటే కొనేశాడని… కానీ డీల్ ఆలస్యమవుతోందని టాక్.. టీవీ9 లో రవిప్రకాశ్ కు 10శాతం వాటా ఉంది. మిగతా 60శాతం ఇన్వెస్టర్ శ్రీనిరాజు చేతిలో ఉంది. ఆయన దీన్ని భారీ లాభాలకు అమ్మేయాలని చూస్తున్నారు. దీంతో సీఈవో రవిప్రకాశ్ తన ఉనికి పోతుందని భయపడి కొత్త పెట్టుబడి దారి కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. పవన్ ఏపీలో రాజకీయంగా ఇప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో టీవీ9ను కొనుగోలు చేసి దానికి తనను సీఈవో గా చేయాలని .. ఏపీలో గెలుపుకు ఇద్దరం కృషి చేస్తామని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే కాటమరాయుడు వేదికపై నిజాయితీ గల నాయకుడు అంటూ రవి ప్రకాశ్ పవన్ ను తెగ పొగిడేశాడు. ఎలాగైనా పవన్ చేత టీవీ9ను కొనిపించి తాను స్వతంత్రంగా టీవీ9లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు సమాచారం.

కాగా ఇప్పటికే రాజకీయాల్లోకి రావడానికి తన వద్ద డబ్బులేదని సినిమాలు చేసుకుంటున్న పవన్ ఈ టీవీ9 సీఈవో ప్రతిపాదనకు ఓకే చెబుతాడా.. లేదా అన్నది ఆసక్తికరం.. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పవన్ తలుచుకుంటే పెట్టుబడి ఈజీగా సమకూరుతుంది. కానీ ఆయన రవిప్రకాశ్ లాంటి జిత్తులమారి జర్నలిస్టు ప్రతిపాదనకు అంగీకరిస్తాడా లేదా అన్నది తేలాల్సి ఉంది.

*మరోకోణం..
ప్రజారాజ్యం పార్టీని చీల్చడానికి డ్యామేజ్ చేయడానికి గతంలో చంద్రబాబు అండ్ కమ్మ సామాజికవర్గంలోని పెద్దలు ప్రజారాజ్యం పార్టీలో అగ్రనేతలుగా ఉన్న ప్రభాకర్ వంటి వాళ్లతో లాలూచీ పడి ఆ పార్టీని దెబ్బతీశారనే టాక్ ఉంది. ఇప్పుడు టీడీపీకి ఇన్నాళ్లు సపోర్టుగా ఉన్న రవిప్రకాశ్ హఠాత్తుగా పవన్ చెంత చేరడం.. ఆయన్ను ప్రశంసించడం చూశాక అవే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే కాటమరాయుడు ఫంక్షన్లో రవిప్రకాశ్.. పవన్ ను పొగిడితే నమ్మలేకపోతున్నానని.. ఇది కలా నిజమా తెలియడం లేదని.. పరోక్షంగా నిర్మాత బండ్ల గణేష్… రవిప్రకాశ్ ను ఉద్దేశించి అనడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

To Top

Send this to a friend