యూపీ: బీజేపీ సునామీ

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకెళ్తోంది. ఎగ్టిట్ పోల్స్ అంచనాకు మించి బీజేపీ భారీ విజయం దిశగా ముందుకుపోతోంది. అధికార సమాజ్ వాదీ పార్టీని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా కూడా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. ఇక బీఎస్పీ పోయినసారి లాగే ఘోర పరాజయం పాలైంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ మధ్యాహ్నానికే దాదాపు 306 సీట్లలో ఆధిక్యం దిశగా సాగుతోంది.. ఎస్పీ-కాంగ్రెస్ లు కేవలం 69 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో సాగుతోంది. బీఎస్పీ 21 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ఇతరులు 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఉత్తరప్రదేశ్ ను చాలా సీరియస్ తీసుకొని ప్రచారం చేశారు. దానికి ఫలితం దక్కింది. పైగా అధికార సమాజ్ వాదీ పార్టీలో తండ్రికొడుకుల కుమ్ములాటలు, శాంతిభద్రతల లోపం కూడా ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ వదిలి మూడు రోజుల పాటు యూపీలోనే మకాం వేసిన చేసిన ప్రచారం బీజేపీకి కలిసివచ్చింది. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో మోడీ నోట్ల రద్దు ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం విశేషం.

To Top

Send this to a friend