యూపీలో గెలుపు ఎవరిదీ.?


మాటల మంటలు ముగిశాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పరిసమాప్తమయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైంది.. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు మోడీకి సెమీఫైనల్ పోరు లాంటిది. ఇప్పుడు విజయం సాధిస్తేనే వచ్చే ఎన్నికల్లో మోడీ నిలబడతాడు..? లేదంటే పడిపోతాడు.. ఈ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ , పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలపైకంటే యూపీపైనే అందరిదృష్టి కేంద్రీకృతమై ఉంది.. యూపీలో కొడితే దేశ రాజధాని పీఠానికి దగ్గర అయినట్టేననే భావనలో దేశ రాజకీయాల్లో ఉంది. అందుకే మోడీ ఢిల్లీ వదిలి గల్లీల్లో మూడు రోజులు ప్రచారం చేసి చెమటోడ్చారు.. ఇంతకీ యూపీలో గెలుపు ఎవరిదన్న దానిపై ఎగ్జిట్ పోల్స్, వివిధ సర్వేలు హోరెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం అన్ని నేషనల్ చానళ్లు, పత్రికల సర్వేల ఫలితాలు వెలువడనున్నాయి.

కాగా తమిళనాడు ఎన్నికలపై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా విఫలమయ్యాయి. అక్కడ డీఎంకే గెలుస్తుందని అన్నీ ప్రకటించగా.. అమ్మ జయలలిత అన్నాడీఎంకే విజయబావుటా ఎగురవేసింది. ఇప్పుడు యూపీలో అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీయే గెలుస్తుందని దాదాపు ప్రకటిస్తున్నాయి. కొన్ని చానాళ్లు మాత్రం హంగ్ వస్తుందని తీర్మానించాయి.

గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 ఎంపీ స్థానాలకు బీజేపీ 73 సీట్లు గెలిచి సంచలనం సృష్టించింది. కానీ ప్రస్తుతం యూపీలో బీజేపీకి గాలి లేదు. అటు ప్రధాని మోడీ, ఇటు అఖిలేష్, రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకొని ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర శాసనసభలో మొత్తం 403 సీట్లున్నాయి. సాధారణ మెజారిటీ 202 సీట్లు రావాలి. అంటే కనీసం 35శాతం రావాలి. మూడు పార్టీల సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారు..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది..

ముఖ్యంగా యూపీలో రాజకీయ సమీకరణాలను చూస్తే పట్టణ ఓటర్లు, యువకులు, అగ్రవర్ణాల వారు బీజేపీకి సపోర్ట్ గా నిలిచారని తెలుస్తోంది. ఇక యాదవ-ముస్లిం ఓట్లు అఖిలేష్-రాహుల్ గాంధీ ల నేతృత్వంలోని కూటమికి పడ్డాయిని విశ్లేషకుల అంచనా.. మాయవతికి జాతవ్-ముస్లిం, దళిత ఓటు బ్యాంకు ఉంది.. బీజేపీకి నోట్ల రద్దు పెద్ద శరాఘాతంగా మారింది. అందుకే అధికారం కల్ల అని చెబుతున్నారు. అధికార ఎస్పీపై వ్యతిరేకత నెలకొంది. బీఎస్పీకి ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యూపీలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొన్ని సర్వేల్లో మాత్రం బీజేపీకి కనీసం 190 సీట్ల వరకు రావచ్చొని మరో 10 సీట్లను కలుపుకుంటే అధికారం సొంతమవుతుందని టాక్.. మొత్తంగా బీజేపీకి కనీసం 15-170 సీట్లు, అఖిలేష్ కూటమికి 110-150 సీట్లు, బీఎస్పీకి 100 లోపే సీట్లు వస్తాయని సమాచారం. దీంతో యూపీలో హంగ్ తప్పనిసరి అని సర్వేలు చెబుతున్నాయి.

To Top

Send this to a friend