మోడీకి ముందుంది ముసళ్ల పండుగ..


ఆయన దేశానికి ప్రధాని.. ఏదో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తే చాలు ఆయన ఇమేజ్ తో ఓట్లు పడతాయి. కానీ మోడీ భయపడిపోతున్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆయన్ను భయపడుతున్నాయి. మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు పరిధిలో 5 ఎమ్మెల్యేలను గెలిపించడానికి మోడీ ఢిల్లీ గద్దె వదిలి.. గల్లీ గల్లీ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.. ఎందుకంటే యూపీతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలు మోడీకి చాలా ప్రతిష్టాత్మకం.. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే 2019లో మోడీ కింగ్ అవుతాడు.. ఓడిపోతే సీనియర్లు, జూనియర్లు సహా అందరూ ఏకమై మోడీ కాళ్ల కిందకు నీళ్లు తెస్తారు. అందుకే మోడీ ఢిల్లీ వదిలి గళ్లీ గళ్లీ తిరిగి కష్టపడుతున్నాడు..

మోడీ దేశ పగ్గాలు చేపట్టాక.. మహారాష్ట్ర, హర్యానా, అసోం రాష్ట్రాల్లో సొంతంగా పగ్గాలు చేపట్టింది బీజేపీ.. ఉత్తరప్రదేశ్ మీద ఇప్పుడు బాగా ఫోకస్ చేశారు. జమ్ము కాశ్మీర్ లో పీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేశంలో ప్రధాని మోడీ ఎన్నికయ్యారంటే అది యూపీ ప్రజలు 2017 ఎన్నికల్లో ఇచ్చిన ప్రోత్సాహమే.. మొత్తం 81 సీట్లక గాను 71 స్థానాల్లో బీజేపీని గెలిపించి బీజేపీ సొంతంగా ఢిల్లీలో గద్దెనెక్కించారు. మోడీని ప్రధాని పీఠం మెక్కించడంలో యూపీ ప్రజలదే కీరోల్. ఇప్పుడు మోడీ గనుక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి మొదటికి వస్తుంది. ప్రీ ఫైనల్ లా భావించే ఈ ఎన్నికల్లో గెలుపు మోడీకీ అత్యంత కీలకం.. ఇది గెలిస్తేనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచే చాన్స్ మోడీకి ఉంటుంది. యూపీలో బీజేపీ గెలిస్తే మరో ఇందిరాగాంధీ లాంటి శక్తివంతుడైన ప్రధానిగా మోడీ నిలిచిపోతారు.. ఓడిపోతే మాత్రం బీజేపీలో ముసలం ముదిరి ఆయన ప్రాభవం తగ్గిపోవడం ఖాయం..

To Top

Send this to a friend