మార్చి 3న కోర్టుకు మహేశ్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చిక్కుల్లో పడ్డాడు. మార్చి 3న కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు మహేశ్ కు నోటీసులు జారీ చేసింది.. మహేశ్ తో పాటు శ్రీమంతుడు చిత్ర నిర్మాత.., మైత్రీ మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ కు, చిత్ర దర్శకుడు కొరటాల శివకు కూడా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి.
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు మూవీ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు ఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. కొరటాల కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తాను ఇదే కథను 2012లో స్వాతి మాసపత్రికలో ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో నవలగా రాశానని.. దాన్నే శ్రీమంతుడు కథగా మలిచారని రచయిత కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు మహేశ్ బాబు, ఎర్నేని నవీన్, కొరటాల శివకు నోటీసులు జారీ చేసిన మార్చి3న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది.

To Top

Send this to a friend