మహేశ్ సినిమా: బిజినెస్, గోప్యత!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకు క్రేజ్ వస్తోంది. దిగ్గజ దర్శకుడు మురగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మహేశ్ బాబు తొలిసారి నటిస్తుండడం.. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుండడంతో హైప్ నెలకొంది. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలుపుకొని ఇప్పటికే దాదాపు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఖాయమంటున్నారు.

మురగదాస్ దర్శకుడిగా ఉండడంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతోందట.. ఇప్పటివరకు ఈ సినిమాలో మహేశ్ లుక్ కానీ, పోస్టర్ కానీ, మరే ఇతర హింట్స్ ఇవ్వకపోయినా సరే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చైన్నైలో జరుగుతున్న చివరి షెడ్యూల్ లో మహేశ్ పాల్గొంటున్నాడు. ఈ చిత్రం ముగిశాక.. మహేశ్ కొరటాల శివ చిత్రంలో నటించనున్నారు.

ఈ సినిమా పూర్తి అయ్యాకే చిత్రం గురించి ప్రమోషన్, ప్రచార చిత్రాలు, ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట.. అప్పటివరకు సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మహేశ్ కానీ, మురగదాస్ కానీ ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

To Top

Send this to a friend