మమ్మల్నే తిడతావా కేజ్రీవాల్.. నువ్ జైలుకే.

దూకుడు అన్ని చోట్ల పనికిరాదు.. రాజ్యంగ బద్ధంగా నియమకమైన సంస్థల విషయంలో రాజకీయ నాయకులు, పౌరులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారితే తగిన మూల్యం తప్పదు అనడానికి కేజ్రీవాల్ ఉదంతమే పెద్ద ఉదాహరణ.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం గోవా కలెక్టర్ ను ఆదేశించింది. గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ‘ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. కానీ ఆమ్ ఆద్మీకే ఓటేయండి..’అని ఆయన ఓటర్లను కోరారు. దీని పై గోవా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దాంతో స్పందించిన ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది..

కానీ ఉగ్రనరసింహుడైన కేజ్రీవాల్.. తనపై బీజేపీ ఎన్నికల సంఘం కక్ష తీర్చుకోవాలనుకుంటోందని.. తనను అడ్డుకోవడం ద్వారా ఎన్నికల కమీషన్ అవినీతి ని ప్రోత్సహిస్తోందంటూ కేజ్రీవాల్ ఎన్నికల సంఘంను తిట్టిపోశారు. దీనిపై ఎన్నికల సంఘం హెచ్చరించినా కేజ్రీవాల్ దారికి రాలేదు. దీంతో విసిగి వేసారిన ఎన్నికల సంఘం జనవరి 31లోపు ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని గోవా కలెక్టర్ ను ఆదేశించింది.. దీంతో ఢిల్లీ సీఎం నోరు జారి ఇలా కష్టాల్లో పడ్డారు.

To Top

Send this to a friend