మంత్రివర్గ విస్తరణ: అడకత్తెరలో బాబు..


మంత్రివర్గ విస్తరణ బాబుకు తలపోటును తీసుకొస్తోంది.. తాను గతంలో అవలంభించిన వైఖరినే బూచిగా చూపి గవర్నర్ నరసింహన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అడ్డుచెప్పడం ఏపీ సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది.. చంద్రబాబు కొత్తగా మంత్రివర్గ విస్తరణ, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి మంత్రి పదవుల పందేరంపై ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్ నరసింహన్ మోకాలడ్డుతున్నారు..

గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు ఆయన టీడీపీలో గెలిచి మంత్రి అయ్యాడని.. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అంతేకాదు దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్లు వేయించారు. అప్పుడు తప్పు అని చెప్పి గవర్నర్ ను టార్గెట్ చేసిన బాబుకు ఇప్పుడు అదే ఫార్ములాను అప్లై చేసి గవర్నర్ భారీ షాక్ ఇచ్చారు.. వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే ముందు వారితో రాజీనామాలు చేయించాలని.. లేకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేది లేదని గవర్నర్ .. చంద్రబాబుకు స్పష్టం చేశారట.. గవర్నర్ ఆదేశాలతో కంగుతిన్నారట చంద్రబాబు అండ్ ఫిరాయింపు దారులు..

గవర్నర్ మరోసారి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం వివాదాస్పదం కాకూడదని చంద్రబాబుకు స్పష్టం చేయడంతో బాబు శిభిరం గందరగోళం లో పడింది.. ఇదంతా టీటీడీపీ నేతలు తలసాని విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడమే.. ఇప్పుడు మన కొంపముంచుందని టీడీపీ శిబిరం, చంద్రబాబు వాపోతున్నారు. అయినా చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అంటే ఇదే మరీ..

To Top

Send this to a friend