బ్రిటీష్ రాణి కోసం బాహుబలి2


బాహుబలి.. బాహుబలి రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా ఇప్పుడు బాహుబలి మేనియానే.. తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న రాజమౌళికి మరో అరుదైన ఘనత దక్కబోతోంది.. ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ సినిమాను చూడడానికి స్వయంగా బ్రిటీష్ రాణి ఎలిజిబెత్ మహారాణి ఇండియా వస్తున్నట్టు టాక్ .. భారత దేశానికి స్వాంతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఇండియన్ సినిమాలను గౌరవిస్తూ ఇండియా ఫిల్మ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది.. ఇందులో ఇండియాకు సంబంధించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో మన తెలుగు సినిమాను ప్రదర్శించడం మనకు దక్కిన గౌరవంగా భావించాలి. బ్రిటన్ మహారాణి ముఖ్య అతిథిగా వస్తున్న ఈ వేడుకలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొని బాహుబలి 2 ను చూడబోతుండడం విశేషంగా చెప్పవచ్చు..

ఏప్రిల్ 28న విడుదల కాబోయే ఈ చిత్రం కోసం ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ వేడుకకు క్వీన్ ఎలిజబెత్ 2, ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇండియాలో దిగ్గజ నటీనటులు, కేంద్ర మంత్రులు హాజరవుతారు.. వీరందరికి ముందుగానే బాహుబలి2 ప్రీ రిలీజ్ ప్రిమియర్ షోను వేసేందుకు బాహుబలి -రాజమౌళి టీం తీవ్ర కసర్తత్తు చేస్తోందట.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో ప్రదర్శించాలని పట్టుదలగా ముందుకువెళుతున్నారట..

To Top

Send this to a friend