బీజేపీకి షాక్..


ఆరోగ్యం బాగాలేక.. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన సోనియాగాంధీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు క్రియాశీలకంగా మారారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల వేళ.. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టడానికి పక్కా స్కెచ్ గీస్తున్నారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోనియా బయటకు రాలేదు. పగ్గాలు యువరాజు రాహుల్ చేతబట్టి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ కు మేలు జరగలేదు. యూపీ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి తలకిందులైంది. దీంతో ఇప్పుడిప్పుడే సోనియా ఆరోగ్యం కుదిటపడింది. రాజకీయంగా తమను టార్గెట్ చేసిన బీజేపీని రాష్ట్రపతి ఎన్నికల వేళ ఓడించడానికి సోనియా రంగంలోకి దిగారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.

బీజేపీ ఏకచత్రాధిపత్యంతో పలు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటోందని.. ప్రాంతీయ పార్టీలతో కలిసి దానిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధినేత్రి భావిస్తోంది. అందుకోసం ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ లతో సోనియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఇప్పటికే బీజేపీ కేంద్రంలో అధికార బలంతో ఇతర పార్టీల నేతలను బెదిరించి రాష్ట్రపతి ఎన్నికలను గెలవడానికి ప్లాన్ చేసింది. అందుకోసమే తమిళనాట అధికార అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లో ఉంచుకొంది. టీఆర్ఎస్, టీడీపీతోనూ సంప్రదింపులు జరుపుతోంది. బీజేపీ అనుసరిస్తున్న బలప్రయోగాలకు తగిన జవాబివ్వాలని ఏకంగా సోనియానే రంగంలోకి దిగారు. ఎలాగైనా రాష్ట్రపతి పదవిని బీజేపీకి దక్కనీయకుండా చేయాలని సంప్రదింపులు జరుపుతున్నారు.

To Top

Send this to a friend