బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే..

ఏం మ్యాజిక్ చేశాడో.. ఎంతగా తర్ఫీదునిచ్చాడో.. ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానీ రాజమౌళి గ్రేట్ .. మన తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే దర్శకుడాయన.. అంతేకాదు.. యావత్ దేశమే గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు.. సినిమా అంటే ఫ్యాషన్.. సినిమా అంటే అకుంఠిత దీక్ష.. సినిమా అంటే ఆరో ప్రాణంలా భావిస్తాడు కనుకే.. ఆయన గొప్ప దర్శకుడిగా వెలుగొందుతున్నాడు.. ఇది ఆయన దర్శకత్వంలో నటించిన వారినెవరిని అడిగినా చెబుతారు..

బాహుబలిలో బిజ్జల దేవ పాత్రధారి సీనియర్ నటుడు నాజర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని చెప్పేదాకా వెళ్లి ఆగిపోయారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలనుకున్న ఏబీఎన్ ఎండీ కుతూహలంపై నాజర్ నీళ్లు చల్లాడు..

ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ ‘రాజమౌళి నాకు సినిమా మొదలవక ముందు స్టోరీ బాగా చెప్పారు. చెబుతుంటే ఆశ్చర్యపోయా.. నా కేరక్టర్ చెప్పలేదు.. స్టోరీ సూపర్ ఎమోషనల్.. ఓ పాత్ర ఉంది చేస్తావా’ అన్నారు.. అది నెగిటివ్ పాత్ర అని.. చెప్పలేదు.. ఈ బిజ్జల దేవ పాత్ర క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదు.. కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటే బాహుబలి చిత్రం ఉండదు.. బిజ్జలదేవ పాత్ర లేకపోతే అసలు బాహుబలి..భల్లాల దేవ మధ్యవైరమే ఉండదు..’ అన్నారు. ఈ సందర్భంగానే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది ఏబీఎన్ ఎండీ చెప్పమనగా.. ఆ ఒక్కటి అడగవద్దని తెలివిగా నాజర్ జవాబిచ్చాడు..

రాజమౌళి ఎంతో పకడ్బందీగా స్టోరీని రూపొందించాడు. యావత్ దేశం ప్రపంచం ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేదానిపైనే ఎదురుచూస్తోంది. అందుకే ఈ సినిమాలో నటిస్తున్న నాజర్ కానీ , ఇతర అగ్రనటులు కానీ ఎక్కడా ఏ ఇంటర్వ్యూల్లో ఆ సీక్రెట్ ను వెల్లడించలేదు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సీక్రెట్ కోసం ఎంతో మంది విలేకర్లు ఎంత ప్రయత్నిస్తున్నా వారికి నిరాశే ఎదురవుతోంది.. సినిమా విడుదలైతే కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎవ్వరికీ తెలియదు..

To Top

Send this to a friend