బాలయ్య హడావుడి చిట్ చాట్ – చిరుకు అడ్డంకులు?

chiranjeevi-balakrishna-sankranthi-cbn

చిరంజీవి అరంగేట్రం అదిరిపోయింది.. నాడు ప్రజారాజ్యంతో ప్రజల ముందుకు వచ్చినా.. నేడు 150 వ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా చిరుపై అభిమానం తగ్గలేదు.. అదీ నిన్నటి హ్యాయ్ లాండ్ లో జరిగిన వేడుకతో ఇది నిరూపితమైంది.. అయితే చిరు తన 150వ సినిమాకు పీక్ పబ్లిసిటీ చేయాలని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రత్యర్థులు దెబ్బతీయడానికి శథవిధాలా ప్రయత్నించారన్నది చిరు ఫ్యాన్స్ భావన.. చిరంజీవి ఆడియో వేడుకను ఆపేందుకు ఏకంగా పర్మిషన్ కూడా ఇవ్వలేదని ఇప్పటికే రగిలిపోతున్నారు..

చిరంజీవి, బాలయ్యకు తెలుగు చిత్రసీమ గర్వంచదగ్గ నటులు.. దురదృష్టమో మరే కారణమో తెలియదు కానీ ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో స్వయానా ఎమ్మెల్యేకావడం.. ముఖ్యమంత్రి వియ్యంకుడు కావడంతో బాలయ్య శాతకర్ణి సినిమాకు హైప్ తీసుకురావడానికి బాలయ్య సామాజికవర్గంతో పాటు ఏపీ అధికార పార్టీ, అనుకూల మీడియా శతవిధాల ప్రయత్నించారు. అందుకే చిరుకు అడ్డంకులు వచ్చిపడ్డాయనడంలో సందేహం లేదు. చివరకు ఏలాగోల చిరు ఆడియో ఫంక్షన్ కు హ్యాయ్ లాండ్ లో జరిపారు. దానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి చిరు రీ ఎంట్రీకి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు.

కాగా చిరంజీవి ఆడియో వేడుక శనివారం సాయంత్రం మొదలుపెట్టకముందే బాలక్రిష్ణ హైదరాబాద్ లో శాతకర్ణి మూవీపై సినీ ప్రముఖులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఓ వైపు రాష్ట్రమంతా చిరు ఫంక్షన్ పై ఫోకస్ చేసి చిరు రీఎంట్రీలో ఎం చెప్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంత హీట్ లో బాలయ్య శాతకర్ణి మూవీపై అంతా100 మంది కూడా హాజరు కాని చిట్ చాట్ లో అనర్గళంగా అదే సమాయానికి మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది.. అంతేకాదు తన అనుకూల మీడియాతో చిరు ఆడియో ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం కాకుండా తన ప్రొగ్రాం ప్రసారం అయ్యేలా ఒత్తిడి తెచ్చారనే అపవాదు బాలయ్యపై పడింది. ఈ పరిణామాలన్నింటిని పరిశీలించిన చిరు అభిమానులు దీన్ని బాలయ్య, చిరు వార్ గా నే పరిగణిస్తున్నారు.. చిరు ఫంక్షన్ కు అడ్డుకునే చర్యలో భాగంగానే బాలయ్య హడావుడి చిట్ చాట్ నిర్వహించారని.. ఎంత మంది అడ్డు వచ్చినా చిరంజీవి స్టామినా ముందు దిగదుడుపేనని నిరూపించామంటున్నారు అభిమానులు.. చిరు ఆడియో పంక్షన్ కు లక్షల మంది రావడమే దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు..

To Top

Send this to a friend