బాలయ్య గురించి పూరి హాట్ కామెంట్

ఏదో ఒక మంచి కథనే తయారు చేసినట్టున్నారు. దాదాపు సంవత్సర కాలంగా తెలుగులో సినిమా లేకుండా ఖాళీగా ఉన్న పూరిజగన్నాథ్ ఈ మధ్యలో పకడ్బందీ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ పవర్ ఫుల్ కథను బాలయ్యకు వినిపించడం ఆయన ఒప్పుకోవడం జరిగిపోయాయి. నిన్న మూహూర్తం ప్రారంభోత్సవం కూడా చేసేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు పూరి జగన్నాథ్ వెల్లడించారు. ‘బాలయ్యతో పనిచేయాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా.. ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉంటుంది. బాలయ్య డైలాగ్స్ లుక్స్ బాగా ఆకట్టుకుంటాయి. పాటలకు సీడీ ఉన్నట్లు ఈ సినిమాకు డైలాగుల కోసం అభిమానులు సీడీ వేసుకుంటారు.. బాలక్రిష్ణ డైలాగులు చెప్పడం లో కింగ్.. ఆయన స్టామినాను పూర్తిగా వినియోగించుకుంటానని’ పూరి చెప్పారు.

పూరిజగన్నాథ్ కొద్దికాలంగా మూస మాఫియా కథలతో నెట్టుకొస్తున్నాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి అగ్రహీరోలు ఒప్పుకోవడం లేదు. ఆయన తీసిన గత సినిమా టెంపర్ కు కూడా వక్కతం వంశీ కథనందిస్తేనే ఎన్టీఆర్ ఒప్పుకొని తీశారు. అలా పూరిపై అపోహలు అగ్రహీరోల్లో నెలకొన్నాయి. కానీ పూరి స్టామినాపై మాత్రం అందరికీ మంచి ఒపినియన్ ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ రాయడంలో పూరిని మించిన వారు లేరు.. ‘పోకిరీలో ఎవ్వడు కొడితే డైలాగ్ కానీ.. టెంపర్ లో ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ కానీ అద్భుతం.. అలాంటి పూరి బాలక్రిష్ణ లాంటి పవర్ ఫుల్ డైలాగ్ కింగ్ దొరికితే వదిలిపెడతాడా..? పెట్టడు.. అందుకే ఈ సినిమాలో బాలయ్యకు పవర్ ఫుల్ డైలాగులు రాశాడట.. బాలయ్య పలికే డైలాగులతో అందరూ డైలాగుల సీడీ వేసుకుంటారని పూరి జగన్నాథ్ కాన్ఫిడెంట్ గా చెప్పడం కొసమెరుపు..

To Top

Send this to a friend