బాలయ్య కోసం పూరి మొదలు పెట్టాడు..


బాలక్రిష్ణ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పూరి జగన్నాథ్ చాలా ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు. దాని కోసం కసరత్తు మొదలు పెట్టాడు. కథ సిద్దంగా ఉండడంతో ఇప్పుడు మార్చి 9 నుంచి షూటింగ్ మొదలుపెడతానని చెప్పాడు. సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తానని ముందే చెప్పిన పూరి ఈ సినిమాలో నటించేందుకు అంతా కొత్తవారిని తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.
పాతవాళ్లు అందరినీ పక్కనపెట్టి కొత్తవారిని ప్రయోగిస్తున్నట్టు మీడియాకు తెలిపారు. ఈ సినిమా కోసం మొత్తం 12 మంది కొత్తవారు కావాలంటూ వారి ఏజ్ గ్రూపు.. ఎలా ఉండాలనేదానిపై ‘కాస్టింగ్ కాల్ ’ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

పూరి విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని కాన్ఫమ్ అయ్యింది.. ఒక కొత్త విలన్ ను తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఏడుగురు మేల్ క్యారెక్టర్ల కోసం ఇద్దరు మహిళా క్యారెక్టర్ల కోసం కావాలని ప్రకటన విడుదల చేశారు. పూర్తిగా కొత్తవాళ్లతో తీస్తానని ప్రకటన విడుదల చేయడంతో ఈ సినిమాలో పాత తెలుగు నటులు ఎవ్వరూ ఉండరని కన్ఫమ్ అయ్యింది..

To Top

Send this to a friend