బామ్మర్ధిపై ప్రేమ.. బాస్ పై తేమ.. బాబుపై పడుతోంది విమర్శల వాన..

chiranjeevi-balakrishna-sankranthi-cbn

బామ్మర్ధి స్వయానా వియ్యంకుడు.. పిల్లన్నిచ్చిన మామ కొడుకు.. పైగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే.. ఆ మాత్రం ప్రేమ ఉండాల్సిందే.. కానీ బామ్మర్దిపై ప్రేమ ఇప్పుడు ఆయనకు పోటీగా నిలస్తున్న హీరోపై కోపంగా మారితేనే పరిస్థితి తారుమారు అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది..
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 150 వ చిత్రం ‘ఖైదీనంబర్ 150’ మూవీ ప్రీ రిలీజ్ ఆడియో వేడుక విజయవాడ-గుంటూరులో చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అనుమతి కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కానీ దీనిపై టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గుంటూరు-విజయవాడ మైదానాల్లో ఎక్కడా ఫంక్షన్ చేసుకోవడానికి అనుమతి లభించలేదు. దీంతో చిరంజీవి విజయవాడకు దూరంగా హాయ్ ల్యాండ్ లో ఫంక్షన్ నిర్వహించాలని ప్లాన్ చేసింది.. కాగా చిరు సినిమా వేడుకకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చిరు 150 సినిమాకు అనుమతి ఇవ్వపోవడం సినిమాకు పబ్లిసిటీ రాకుండా దెబ్బతీసే ప్రయత్నమేనని చిరు అభిమానులు మండిపడుతున్నారు.

కాగా సంకాంత్రి కానుకగా చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150.. బాలక్రిష్ణ 100 చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రహీరోలు ఒకేసారి రిలీజ్ చేస్తుండడం కూడా హీట్ పుట్టిస్తోంది. చిరు, బాలయ్య అభిమానులు అంచనాలు పెంచుకుంటూ వేడి రగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇలా చిరు సినిమా వేడుకకు పర్మిషన్ ఇవ్వకపోవడం వివాదానికి కారణమైంది. ఇది బాలయ్య శాతకర్ణి సినిమాకు మైలేజ్ కోసమే చంద్రబాబు చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనకాల ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే విషయంపై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

To Top

Send this to a friend