బాబూ మ్యాజిక్.. ఆ లక్షల కోట్లు ఎటుపోతున్నాయ్?

నిన్నటి నుంచి ఒకటే ఊదరగొట్టుడు.. 3 లక్షల కోట్లు అని కొన్ని చానాళ్లు. .. కాదు అధికారికంగా 4.25 లక్షల కోట్లు అని మరికొందరు ఇలా అందరూ లక్షల కోట్ల మాటే అంటున్నారు. కానీ అవన్నీ వస్తాయా.. ఏపీ తలరాత మారుతుందా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది..
గతేడాది కూడా సేమ్ సీన్.. సీఐఐ సదస్సు పేర చంద్రబాబు ఆర్భాటం.. కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఘనంగా పెట్టుబడుల సదస్సును నిర్వహించారు. దాదాపు 8 లక్షల పెట్టుబడులు ఆకర్సించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు సదస్సు ముగిశాక గొప్పగా చెప్పుకొచ్చారు. ఏపీ సింగపూర్ లా మారిపోతుందని ఆయన అనుకూల మీడియా, పత్రికలు తెగ రాసేశాయి.. ఏడాది తిరిగేసరికి మళ్లీ అదే సదస్సులు, అవే పెట్టుబడులు.. అవే లక్షల కోట్లు..
పోయినేడాది వాటికే ఇప్పటివరకు దిక్కులేదు.. ఏ ఒక్క ప్రాజెక్టు ఏపీలో మొదలైంది లేదు.. ఏ ఒక్కరికి ఉపాధి లభించింది లేదు. కనీసం భూమిపూజలు కూడా జరగలేదు. అప్పట్లోనే లక్షల కోట్ల ప్రాజెక్టులన్నీ మరి ఎటు వైపు వెళ్లాయి.. ఎక్కడ పెట్టుబడులు పెట్టారొ బాబూ గారు చెప్పాల్సిందే.. అవి ఇంకా ఏర్పడకముందే మళ్లీ  విశాఖలో సీఐఐ సదస్సు జరిగింది. కేంద్ర గడ్కరి వచ్చారు. సాగరమాలకు లక్ష కోట్లు, పోర్టుల అభివృద్ధి కోట్లు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మొత్తంగా ఓ 6 లక్షల కోట్లు పెట్టుబడులు ప్రకటన పూర్తయ్యింది. మరి అవన్నీ పరిశ్రమలుగా మారుతాయా..? ఉద్యోగాలు వస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఈ ఆర్భాటపు సదస్సులు నిర్వహిస్తున్న బాబూ మహిమ..

To Top

Send this to a friend