బాబు నుంచి కోడెల వరకు అంతా కేసుల మయం


చంద్రబాబు మెడకు ఓటుకు నోటు కేసు.. ఏపీ స్పీకర్ కోడెలకు తాజాగా కరీంనగర్ కోర్టు నోటీసులు.. ఎన్నికల అఫిడవిట్ ఖర్చులో లక్షలు గోల్ మాల్ చేశాడని ఆరోపణ.. అంతకుముందే కోడెలపై ఆయన కోడలు పెట్టిన కేసు పెండింగ్ లో ఉంది.. విశాఖలో భూకుంభకోణంలో మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు ఇలా ఎందో టీడీపీ మంత్రులు, నాయకులు మొత్తం కేసుల ఉచ్చులో చిక్కుకొని విలవిల లాడుతున్నారు..

ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకముందు పదేళ్లు ప్రతిపక్షంలో పోరాడింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో సహజంగా చేతిలో చిల్లీ గవ్వ లేకుండా నాయకులు అధికారం కోసం ఎంతో శ్రమించారు. 2014లో మోడీ, పవన్ సపోర్టుతో అధికారంలోకి రాగానే ఇన్నాళ్లు బిచ్చగాళ్లుగా ఉన్న నాయకులందరూ ఎడాపెడా దోచేయడం ప్రారంభించేశారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, భూ దందాలు.. ఇలా ఒక్కటేమిటీ అధికారులతో కలిసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విచ్చలవిడి అవినీతి వల్లే ఓ కేంద్రంలోని సంస్థ నిర్వహించిన అవినీతి రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇది బాబు సర్కారుకు శరాఘాతంగా మారింది.

పదేళ్లు అధికారంలో ఉండి గద్దెనెక్కడంతో మళ్లీ వస్తామో రామో అన్న తొందరలో నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. పోలీసులను మేనేజ్ చేసినా కానీ కోర్టుల ముందు వీరి ఆటలు సాగవు కనుక బయటపడిపోతున్నారు. చంద్రబాబుకు ఓటుకు నోటు కేసుతో తలబొప్పి కడుతోంది. సుప్రీం ఆయనకు తాజాగా నోటీసులు పంపింది. కోడెలకు ఎన్నికల ఖర్చుపై తాజాగా కరీంనగర్ కోర్టు నోటీసులిచ్చింది. మంత్రి గంటా భూకబ్జాపై కోర్టు నోటీసులు.. ఇలా నాయకుల దందాలు బహిర్గమై కోర్టుల దాకా వెళ్లాయి. ఏపీలో అవినీతి పాలన పెచ్చరిల్లిందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం..

To Top

Send this to a friend