బాబు తిట్టాడని ట్రావెల్స్ క్లోజ్?

ఇటీవల విజయవాడ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై దాడికి పాల్పడ్డ ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు పిలిచి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన ఎంపీ కేశినేని నాని ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్టు చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో కొద్దిరోజులుగా మీడియా కంట పడకుంటా ముభావంగా ఉంటున్న నాని.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు అవరోధంగా ఉంటున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యాడరు. ఈ మేరకు బస్సులను అమ్మేసి కేశినేని ట్రావెల్స్ రద్దు చేస్తున్నారు.

శనివారం హైదరాబాద్ లో కేశినేని ట్రావెల్స్ సంస్థ కు ఉన్న బోర్డును తొలగించారు. సంస్థకు చెందిన మొత్తం 170 బస్సులను అమ్మకానికి పెట్టింది యాజమాన్యం. కేశినేని ట్రావెల్స్ సంస్థకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆఫీసులున్నాయి. వాటన్నింటిని క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

కేశినేని నాని అక్రమ పద్ధతుల్లో బస్సులు నడుపుతూ భారీగా లాభాలు ఆర్జించి ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతోందని కేశినెని ట్రావెల్స్ పై ఆరోపణలున్నాయి. ఎంపీగా ఉంటూ ప్రోత్సహిస్తూ బస్సులు నడిపిస్తున్నారని నానిపై విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ నాని ట్రావెల్స్ రద్దు చేయడానికి కారణమయ్యాయి. ట్రాన్స్ పోర్టు కమిషనర్ పై దాడితో విమర్శలు ఎక్కువయ్యాయి. రాజకీయాలు, వ్యాపారాలు ఏకకాలం సాధ్యం కావని తాను ఎన్నో ఏళ్లుగా చేసుకుంటున్న వ్యాపారాలను నాని వదిలేయడం గమనార్హం.

To Top

Send this to a friend