బన్నీ అభిమానులు శివరాత్రికి రెడీ ఉండండి..


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శివరాత్రి పండుగ పూట తన అభిమానుల్లో జోష్ నింపనున్నాడు. పండుగను మరింత ద్విగుణీకృతం చేయనున్నాడు. నాలుగు రోజుల కిందట బన్నీ తన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అలరించాడు. బ్రాహ్మణ యువకుడిగా బన్నీ ఇచ్చిన ఫోజుకు ఇండస్ట్రీనే షేక్ అయ్యింది. దానికి విశేష స్పందన రావడంతో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్, హీరో అల్లు అర్జున్ లు వేగంగా ఈ శివరాత్రికి టీజర్ ను లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మహాశివరాత్రి కానుకగా బన్నీ దువ్వాడ జగన్నాథమ్ మూవీ టీజర్ లాంచ్ చేయబోతున్నట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది.. మరో రెండు రోజుల్లో అభిమానులకు బన్నీ అసలైన కానుక అందించబోతున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు డీజే టీజర్ లాంచ్ చేస్తున్నారట.. ఇప్పటికే బ్రాహ్మణ యువకుడిగా ఫస్ట్ లుక్ సెన్సేషన్ సృష్టించింది ఇప్పుడు టీజర్ మరింతె సంచలనం సృష్టిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీంతో బన్నీ అభిమానులు శుక్రవారం వరకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

To Top

Send this to a friend